‘చిసెల్డ్’, ‘రాస్ మెటానోయా’ చిత్రాలకు న్యూయార్క్ ప్రాంత వాసి అయిన చిత్ర దర్శకుడు రామ్ అల్లాడి  అనేక అంతర్జాతీయ పురస్కారాలను, ప్రశంసలను అందుకున్నారు. ఇప్పుడు మహిళలు, స్వేచ్ఛపై ఆధారపడిన ‘పేజెస్’ అనే రాజకీయ నేపథ్య చిత్రంతో వస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ మధ్యే విడుదలైంది. ఆసక్తికరంగా ఉండటంతో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.’పేజెస్’ చిత్రాన్ని హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఆంగ్ల భాషలలో రూపొందిస్తున్నారు. ఫిమేల్ ఓరియెంటెడ్ చితమిది. ఇందులో కల్పనా తివారీ ప్రధాన పాత్రలో నటించారు.’పేజెస్’ గురించి దర్శకుడు రామ్ అల్లాడి మాట్లాడుతూ…

”సామాజిక స్వేచ్ఛకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న వ్యత్యాసం మా చిత్రంలో మరో ప్రధాన అంశం. స్వాతంత్య్రానంతర పరిణామాల వల్ల ప్రభావితమైన ఒక రాజకీయ కుటుంబం నేపథ్యంలో సాగే ఇది. ఢిల్లీ, భారత – పాకిస్తాన్ సరిహద్దు, బంగ్లాదేశ్‌ లోని నవఖాలి, తెలంగాణ ప్రాంతాలలో ముడిపడిన కథ ఇది. రెండు దశాబ్దాల నా ప్రవాస భారతీయ జీవితం నన్ను కథ రాయడానికి ప్రభావితం చేసింది. ఇది పూర్తి స్థాయి కల్పిత కథ. ఈ చిత్రంలో కల్పనా తివారీతో పాటు మరో ముగ్గురు మహిళలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తున్నాం. కథ, స్క్రీన్‌ప్లే, ఛాయాగ్రహణం, సంగీతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తాయి” అని అన్నారు.

, , , , , , , , ,