వెంకీ “దృశ్యం 2” వ‌చ్చేది థియేటర్లలో కాదు.. ఓటీటీలో
Latest Movies OTT Regional Tollywood

 వెంకీ “దృశ్యం 2” వ‌చ్చేది థియేటర్లలో కాదు.. ఓటీటీలో

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన తాజా చిత్రం దృశ్యం 2. ఇది మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన దృశ్యం 2 చిత్రానికి తెలుగు రీమేక్
ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా అయిన ఈ దృశ్యం 2 చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెర‌కెక్కించారు. చాలా త‌క్కువ టైమ్ లోనే ఈ చిత్రాన్ని కంప్లీట్ చేశారు. అయితే.. నార‌ప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయ‌డం.. ఆ సినిమా ఓటీటీలో స‌క్స‌స్ సాధించ‌క‌పోవ‌డంతో దృశ్యం 2 చిత్రాన్ని థియేట‌ర్లోనే రిలీజ్ చేయ‌డానికి సురేష్ బాబు ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. ఏమైందో ఏమో కానీ.. దృశ్యం 2 చిత్రాన్ని థియేట‌ర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు దృశ్యం 2 చిత్రాన్ని న‌వంబ‌ర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్న‌ట్టుగా అధికారికంగా ప్ర‌క‌టించారు. నార‌ప్ప సినిమాను థియేట‌ర్లో మిస్ అయ్యాం.. దృశ్యం 2 థియేట‌ర్లోకి వ‌స్తుంద‌ని ఎదురు చూసిన వెంకీ అభిమానుల‌కు ఇది ఒక ర‌కంగా షాకే అని చెప్ప‌చ్చు. ఓటీటీలో నార‌ప్ప మెప్పించ‌లేదు. మ‌రి.. దృశ్యం 2 సినిమాతో అయినా వెంకీ మెప్పిస్తాడేమో చూడాలి.

Post Comment