Latest OTT

నారప్పకు ఆ సినిమా పోటీ ఇస్తుందా..?

ఈ వారం ఓటిటిలో ఒక తెలుగు సినిమా, మరో తమిళ్ సినిమా మధ్య ప్రధాన పోటీ ఉంది. వెంకటేష్ నటించిన నారప్ప, తమిళ్ హీరో ఆర్య నటించిన సార్పట్ట పరంపర అనేవి ఆ చిత్రాలు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురణ్ ను తెలుగులో వెంకీ నారప్పగా రీమేక్ చేశాడు. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఇవాళ్టి నుంచి స్ట్రీమ్ అవుతోంది. కట్ కాపీ పేస్ట్ లా కనిపించిందంటూ టాక్ తెచ్చుకున్నా.. వెంకటేష్, ప్రియమణి, రాజీవ్ కనకాల నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.

ఇక రజినీకాంత్ తో కబాలి, కాలా వంటి చిత్రాలు చేసి దేశవ్యాప్తంగా అటెన్షన్ సంపాదించుకున్న తమిళ్ దర్శకుడు పా రంజిత్ తాజా చిత్రమే ఈ సార్పట్ట పరంపర. బ్రిటీష్ కాలం నుంచి కొందరు దళితుల్లో నిలిచిపోయిన బాక్సింగ్ గేమ్ నేపథ్యంలో నడిచిన కథ ఇది. కాస్త పీరియాడిక్ సాగిన ఈ మూవీని తెలుగులో సార్పట్ట పరంపరగా డబ్ చేశాడు. ఇది కూడా అమెజాన్ లోనే విడుదలైంది.

ఆర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పూర్తిగా పా రంజిత్ ఐడియాలజీకి అనుగుణంగా నడించిందంటున్నారు. మరి అల్టిమేట్ గా ఆకట్టుకున్న సినిమా ఏదనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.

Post Comment