ఓటీటీలో రెండు భాష‌ల్లో వ‌స్తున్న “మ‌హా స‌ముద్రం”
Latest Movies OTT Tollywood

ఓటీటీలో రెండు భాష‌ల్లో వ‌స్తున్న “మ‌హా స‌ముద్రం”

ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన తాజా చిత్రం మ‌హా స‌ముద్రం. శ‌ర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేష‌న్లో రూపొందిన ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి కానీ.. అంచ‌నాలు అందుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. సిద్ధార్థ్ ఈ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు కానీ.. ఆశించిన ఫ‌లితాన్ని అందివ్వ‌లేదు. దీంతో మ‌హా స‌ముద్రం ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.

ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోవ‌డంతో ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి సోష‌ల్ మీడియాలో స్పందిస్తూ.. సారీ.. ఈసారి అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు సినిమా తీస్తాన‌న్నారు. ఇదిలా ఉంటే.. ఎట్టకేలకు ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసినట్టు తెలుస్తుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటిలోకి వచ్చింది. ఒకవేళ మ‌హా స‌ముద్రం చిత్రాన్ని థియేట‌ర్లో మిస్ అయిన వాళ్లు ఎవ‌రైనా ఈ చిత్రాన్ని చూడాల‌నుకుంటే.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

Post Comment