కాంతార.. ఇండియాలో ఈ మధ్య అత్యంత పెద్ద విజయం సాధించిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ లేదు. భారీ తారాగణం కాదు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో పెద్దగా పనిలేకుండానే కేవలం 18 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి ఎంటైర్ కంట్రీని ఇన్స్ స్పైర్ చేసింది. మామూలుగా కేవలం కన్నడ ప్రేక్షకులు టార్గెట్ గానే ఈ మూవీ తెరకెక్కింది. కానీ అక్కడి ట్రైలర్ తో పాటు రివ్యూస్ కు వచ్చిన రేటింగ్స్ చూసి ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేశారు. మామూలుగా రీమేక్ కు సాధ్యం కాని కథ కావడంతో డబ్బింగ్ తోనే ఆయా భాషల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.

విశేషం ఏంటంటే.. ఇది కర్ణాటకలోని ఓ జానపద సంప్రదాయమే అయినా.. భారతదేశంలో ఇలాంటి సంప్రదాయాలు కాస్త అటూ ఇటూగా అన్ని రాష్ట్రాల్లో ఉండటంతో అందరికీ కనెక్ట్ అయింది. అందుకే అంత పెద్ద విజయం సాధించింది. చాన్నాళ్ల తర్వాత ఓ డబ్బింగ్ సినిమా యాభై రోజుల పోస్టర్ కూడా చూసిందంటే అది కాంతార సినిమాకు ఉన్న రేంజ్ గా చెప్పాలి. సో.. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదని మరోసారి ప్రూవ్ చేసిన కాంతార.. ఓటిటి వ్యూయర్స్ మాత్రం షాక్ ఇస్తోంది.


ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ లో స్ట్రాంగ్ గానే ఉంది కాంతార సినిమా. దీంతో ముందు చెప్పినట్టుగా ఓటిటిలో విడుదల చేస్తారా అనుకున్నారు. బట్ చెప్పిన టైమ్ కే విడుదల చేశారు. అయితే ఓటిటి కోసం ఈగర్ గా ఎదురుచూసిన ఆడియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిందీ మూవీ. ఎందుకంటే ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచిన వరాహ రూపం దైవం అనే పాటను లేపేశారు. అంటే మొదట్లో వచ్చే ఐదు నిమిషాల సీన్ తో పాటు క్లైమాక్స్ మొత్తం లేపేశారన్నమాట.

నిజానికి సినిమాకు ఇవే మెయిన్ హైలెట్ గా నిలిచాయి. హీరో, దర్శకుడు రిషభ్ శెట్టి విశ్వరూపం కనిపించింది కూడా ఈ సన్నివేశాల్లోనే. మరి ఎందుకు ఈ పాటను కట్ చేశారు అంటే.. ఆ మధ్య సినిమా విడుదలైనప్పుడే ఈ పాటపై విమర్శలు వచ్చాయి. పంజూర్లి తెర వారి పాట ఇది. వాయిద్యాలు కూడా పూర్తిగా వాటినే కాపీ కొట్టాడు సంగీత దర్శకుడు అజనీష్‌ లోకనాథ్. ఆయనపై కేస్ వేస్తాం అని కూడా చెప్పారు. మరి సినిమా వరకూ ఏం కాంప్రమైజ్ అయ్యారో కానీ.. ఓటిటిలో ఆ పాటను లేపేశారు. మరి ఈ పాట లేకుండా మొదటి సారి చూసే వారికి ఏ ఇబ్బంది ఉండదు కానీ.. ఆల్రెడీ చూసిన వాళ్లు మాత్రం మళ్లీ చూడ్డం కష్టమే.