వాసుదేవ రావు, హర్షిత, శిరీష, అవోన్ స్కైస్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ గ్రీష్మ. ఈ షో కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు షో రన్నర్ గా వ్యవహరిస్తూ నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. పది వారాల ఈ వెబ్ సిరీస్ లో 80 ఎపిసోడ్స్ ఉన్నాయి.

ఓ న్యూస్ ఛానెల్ నేపథ్యంగా ఇద్దరు మహిళల మైండ్ గేమ్ సాగే ఈ కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుంది. ఇతర భాషల్లో ఈ ఫార్మాట్ ఇప్పటికే మంచి విజయాన్ని సాధించింది. తొలిసారి ఈ టైప్ షోను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ.

ఈ కథ విషయానికొస్తే …తన తండ్రి మృతికి కారణమయిన గ్రీష్మపై వర్ష ఎలా రివేంజ్ తీర్చుకుంటుంది. ఇద్దరు అమ్మాయిల మధ్య మైండ్ గేమ్ లో తర్వాత ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉండనుంది.

ఈ వెబ్ సిరీస్ లో ఇతర పాత్రల్లో కాజల్, యుువరాజ్, మేఘన, ఝాన్సీ రాథోడ్, ధర్మ దోనెపూడి, జశ్వంత్, సూరజ్ రెడ్డి మువ్వ, కరుణ భూషన్, వినాయక్ తదితరులు నటిస్తున్నారు.