సెన్సేష‌న‌ల్ హీరోతో బాల‌య్య అన్ స్టాప‌బుల్ ఎపిసోడ్. ఇంత‌కీ.. ఎవ‌రా హీరో.?
Latest Movies OTT Tollywood

సెన్సేష‌న‌ల్ హీరోతో బాల‌య్య అన్ స్టాప‌బుల్ ఎపిసోడ్. ఇంత‌కీ.. ఎవ‌రా హీరో.?

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహాలో అన్ స్టాప‌బుల్ అంటూ టాక్ షో చేస్తున్న విష‌యం తెలిసిందే. ఫ‌స్ట్ ఎపిసోడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుతో బాల‌య్య చేశారు. ఆ ఎపిసోడ్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆత‌ర్వాత ఈ టాక్ షోలో నేచుర‌ల్ స్టార్ నాని బాల‌య్య క‌లిసి చేసిన‌ సంద‌డి అంతా ఇంతా కాదు. ఇలా ఎపిసోడ్ ఎపిసోడ్ కి ఇంట్ర‌స్టింగ్ గా ప్లాన్ చేస్తుండ‌డంతో ఈ షో పై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డింది.

నెక్ట్స్ ఏ హీరోని బాల‌య్య ఇంట‌ర్ వ్యూ చేయ‌నున్నార‌నేది ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈసారి ఎపిసోడ్ బాలయ్య మరియు మన టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండల మధ్య ఉండబోతుందట. ఈ సౌండింగ్ నే వేరే లెవెల్లో ఉంది. ఇక ఈ ఎపిసోడ్ ఇంకెంత ఎనర్జిటిక్ గా ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాల‌య్య ఏ ఏ ప్ర‌శ్న‌లు అడ‌గ‌నున్నారు. ఎలాంటి స‌మాధానాలు రాబ‌ట్ట‌నున్నారు అని వ్యూయ‌ర్స్ లో క్యూరియాసిటీ మ‌రింత‌గా పెరిగింది. త్వ‌ర‌లోనే ప్రొమో రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Post Comment