OTT

ఎన్నాళ్లకెన్నాళ్లకు ‘ఆహా’ అనిపించారు.. !

తెలుగులో ప్రముఖ ఓటిటి సంస్థగా పేరు తెచ్చుకున్నా.. ఆ స్థాయిలో సినిమాలు లేని ఏకైక ప్లాట్ ఫామ్ ‘ఆహా’. ఆహాలో ఓ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా రాడ్డే అనేది మెజారిటీ ఆడియన్ ఫీలింగ్. ముఖ్యంగా వెబ్ సిరీస్ ల విషయంలో పూర్తిగా విఫలమైంది. దీంతో చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆహాపై సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా వచ్చిన ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సిరీస్ మొదటిసారిగా ఈ ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆకట్టుకుంటోంది.

ఈ సిరీస్ కు మంచి టాక్ వచ్చింది. దీంతో ఎన్నాళ్లకెకన్నాళ్లకు ఆహాలో ఓహో అనిపించే కంటెంట్ వచ్చిందంటూ ఆనందపడుతున్నారు. అన్నట్టు ఈ సిరీస్ తో అమలాపాల్ కూడా మంచి బ్రేక్ సంపాదించుకుంది. రాబోయే రోజుల్లో తను మరిన్ని తెలుగు వెబ్ సిరీస్ లతో బిజీ అయినా ఆశ్చర్యం లేదు. పైగా అమ్మడు బోల్డ్ కంటెంట్ అంటే పెద్దగా ఇబ్బంది కూడా పడదు కదా..

Post Comment