సెప్టెంబర్ 17న హాట్ స్టార్ డిస్నీలో  ‘అనబెల్ & సేతుపతి’ విడుదల..
Latest Movies OTT

సెప్టెంబర్ 17న హాట్ స్టార్ డిస్నీలో  ‘అనబెల్ & సేతుపతి’ విడుదల..

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్ పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మిస్తున్న సినిమా ‘అనబెల్ & సేతుపతి’. దీపక్ సుందరరాజన్ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 17 హాట్ స్టార్ డిస్నీలో నేరుగా విడుదల కానుంది ‘అనబెల్ & సేతుపతి’ సినిమా. ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ ఫేస్ బాగా హైలెట్ చేశారు. వెనకాల బంగ్లా ఒకటి బాగా ఫోకస్ చేశారు. పోస్టర్ ఆన్ రివర్స్ లో చూస్తే మిగిలిన నటీనటులను పరిచయం చేశారు. పోస్టర్ లో హారర్ థ్రిల్లర్ అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో ‘అనబెల్ & సేతుపతి’ కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

Post Comment