ad

వ‌రుస‌గా విభిన్న క‌థల‌తో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నాగ‌శౌర్య‌. ఇటీవ‌ల నాగ‌శౌర్య వ‌రుడు కావ‌లెను సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇందులో రీతువ‌ర్మ క‌థానాయిక‌. ఈ సినిమా ద్వారా ల‌క్ష్మీ సౌజ‌న్య ద‌ర్శ‌కురాలుగా ప‌రిచ‌యం అయ్యింది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. అయితే.. ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో రిలీజైంది.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన స్ధాయిలో స‌క్స‌స్ సాధించ‌క‌పోయినా… ఓటీటీలో మాత్రం సూప‌ర్ స‌క్స‌స్ అయ్యింది. జస్ట్ కొన్ని రోజులు కితమే స్ట్రీమింగ్ యాప్ జీ5 లోకి వచ్చిన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 5 కోట్ల నిమిషాల వ్యూస్ ని అందుకుంది. దీనితో టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 5 కోట్ల వ్యూ మినిట్స్ అందుకున్న చిత్రంగా వ‌రుడు కావ‌లెను చిత్రం రికార్డు సెట్ చేసింది.

Image

ఇక ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందించారు. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. మొత్తానికి ఓటీటీలో వ‌రుడు కావ‌లెను చిత్రం సూప‌ర్ స‌క్స‌స్ సాధించ‌డం విశేషం.

, , , , , , , , , , , , , , ,