వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు హీరో విశ్వ‌క్ సేన్. రీసెంట్ గా వ‌చ్చిన అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం చిత్రంతో మెప్పించిన విశ్వ‌క్ ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ స్టోరీతో వ‌స్తున్నాడు. అయితే ఇది త‌మిళ్ లో సూప‌ర్ హిట్ అయిన ఓ మై క‌డువులే అనే చిత్రానికి రీమేక్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌లైంది. అచ్చంగా త‌మిళ్ సినిమానే దించేసిన‌ట్టు క‌నిపిస్తున్నా.. విశ్వ‌క్ ఇమేజ్ కు ప‌ర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే స్టోరీ ఇది. అందుకే తెలుగులోనూ చాలా ఫ్రెష్ గా క‌నిపిస్తోంది. అన్న‌ట్టు ఒరిజిన‌ల్ రూపొందించిన అశ్వ‌క్ మారిముత్తునే తెలుగులోనూ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. దీంతో పెద్ద‌గా ఇబ్బంది లేకుండా క‌నిపిస్తోంది.


త‌న చిన్న‌నాటి ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తుంది ఓ యువ‌కుడికి. ఆ పెళ్లి త‌న‌కు ఇష్టం ఉండ‌దు. పెద్ద‌ల కోసం త‌ల వంచుతాడు. స‌రే అని అడ్జెస్ట్ అవుతోన్న టైమ్ లో త‌న చిన్న‌ప్ప‌టి స్కూల్ మేట్.. అప్ప‌ట్లో త‌ను అక్కా అని పిలిచిన అమ్మాయి కొత్త‌గా త‌న లైఫ్ లోకి వ‌స్తుంది. అప్పుడు అక్కా.. అన్నా.. ఇప్పుడు ల‌వ్ లో ప‌డ‌తాడు. దీంతో ఈ ముగ్గురి మ‌ధ్య జ‌రిగిన కాన్ ఫ్లిక్ట్ నేప‌థ్యంలో ఈ క‌థ న‌డుస్తుంది. అదంతా ట్రైల‌ర్ లోనే చూపించినా.. క‌థ‌నం ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకునేలా ఉండ‌ట‌మే ఈ చిత్రానికి మెయిన్ హైలెట్.


ఇక విధిరాత‌ను మార్చ‌లేరు అనే పాయింట్ క‌నిపిస్తుంది. అందుకే దేవుడిని సినిమాలో పెట్టారు. ఆ దేవుడి పాత్ర‌లో మ‌న విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించాడు. ఈ పాత్ర లెంగ్త్ చాలా త‌క్కువే. కానీ క‌థ‌లోని అన్ని మ‌లుపుల‌కు కార‌ణం అవుతుంది. త‌మిళ్ లో ఈ పాత్ర‌ను విజ‌య్ సేతుప‌తి పోషించాడు.

మొత్తంగా కాస్త కోర్ట్ రూమ్ డ్రామా, కాస్త స్కూల్, కాస్త ఫ్రెండ్షిప్, ల‌వ్, మ్యారేజ్, కాన్ ఫ్లిక్ట్ అంటూ క‌నిపిస్తోన్న ఈ ట్రైల‌ర్ ప‌ర్ఫెక్ట్ గా వ‌చ్చింది. చూస్తోంటే ఈ నెల 21 విడుద‌ల‌వుతోన్న ఈ చిత్రంతో విశ్వ‌క్ సేన్ ఖాతాలో మ‌రో హిట్ ప‌డేలానే ఉంది.

, , , , ,