ప్రభాకర్ తెలుసు కదా.. అదే ఈటీవి ప్రభాకర్ అనో లేక యాహూ ప్రభాకర్ అనో అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. చిన్న చిన్న పాత్రలతో నటుడుగా పరిచయమై తర్వాత ఈటీవిలో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. అప్పట్లో రామోజీరావు తనయుడు దివంగత సుమన్ తర్వాత ఆ రేంజ్ స్టేటస్ అనుభవించాడు. బట్ అదే ప్లేస్ నుంచి అవమానకరంగా బయటకు గెంటివేయబడ్డాడు అది వేరే విషయం. అప్పట్లో అప్ కమింగ్ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ సత్తా చాటాడు ప్రభాకర్. కొన్ని సినిమాల్లో కీలకమైన పాత్రల్లోనూ మెప్పించాడు. ప్రస్తుతం పలు టివి ఛానల్స్ లో రకరకాల సీరియల్స్ లో నటిస్తున్నాడు. కొన్ని తనే నిర్మిస్తున్నాడు కూడా.

అలాంటి ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు. చదువుకుంటున్నప్పటి నుంచే యాక్టింగ్ తో పాటు యాక్షన్ లోనూ ట్రెయినింగ్ ఇప్పించాడట. ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన చంద్రహాస్ ను హీరోగా లాంచ్ చేస్తూ ఓ సెన్సేషనల్ విషయం చెప్పాడు. అతను ఒకేసారి మూడు సినిమాలతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇంత వరకూ బానే ఉంది. ఇలాంటి ఇంటర్ డక్షన్ స్టార్ హీరోల తనయులకూ దక్కలేదు. కానీ ఒక్క విషయం మాత్రం విశేషంగా కనిపిస్తోంది.ప్రభాకర్ దంపతులు తమ కొడుకును పరిచయం చేస్తున్నప్పుడు ఆ కుర్రాడు కుదురుగా నించోలేకపోయాడు. అటూ ఇటూ కదులుతూ.. జేబులో చేతులు పెట్టుకుంటూ కాస్త కాన్ఫిడెంట్ గా ఉండేందుకు ప్రయత్నించాడు.

అంతే.. ఇక కమెంట్స్ అన్నీ అతనికి నెగెటివ్ గానే ఉన్నాయి. కుర్రాడికి ఒబీడియన్స్ లేదు.. అస్సలు హీరోగా పనికిరాడు.. ఇంత యాటిట్యూడ్ అయితే కష్టమే.. అంటూ ఓ రేంజ్ లో కమెంట్స్ మొదలుపెట్టారు జనం. కొన్ని కమెంట్స్ అయితే దరిద్రంగా కూడా ఉన్నాయి. మొత్తం కమెంట్స్ లో రెండు మూడు శాతం కూడా కుర్రాడికి పాజిటివ్ గా కనిపించలేదు.అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఆ కుర్రాడు కొత్తవాడు. యంగ్ స్టర్. మీడియా ముందో లేక అంతమంది పెద్దల ముందో భయపడుతూ ఉండొచ్చు. ఆ భయాన్ని కవర్ చేయడానికి రకరకాల యాక్ట్స్ లో కనిపించి ఉండొచ్చు.

దీన్ని పాజిటివ్ గా తీసుకోవాల్సని ఆడియన్స్ పూర్తి నెగెటివ్ గా చూస్తున్నారు. నిజానికి అతని ఫేస్ లో ఆ భయం స్పష్టంగా కనిపిస్తోంది. స్టేజ్ ఫియర్ అని చెప్పలేం కానీ ఓ రకమైన “షై” ఫీలింగ్ ను కవర్ చేసుకునే ప్రయత్నం కనిపించింది.అయినా ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివిటీ తప్ప పాజిటివిటీ బూతద్దం పెట్టి వెదికినా కనిపించడం లేదు. ఏ మాటకామాటే కుర్రాడు బావున్నాడు. స్టార్ హీరో అవుతాడా లేదా అనేది చెప్పలేం కానీ.. హీరో మెటీరియల్ లానే ఉన్నాడు. కాస్త ఈ పనికిమాలిన వారి కోసం వినయం నటించినా ఫర్వాలేదు కానీ.. మంచి కథలు ఎంచుకుంటూ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే నిలబడే అవకాశం ఉంది. ఏదేమైనా చంద్రహాస్.. ఇలాంటివేం పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని కోరుకుందాం..

, , , , ,