స్నేహానికన్న మిన్నా.. లోకాన లేదు అంటాడో సినీ కవి. ఆ మాటను అక్షరాలా పాటించే స్నేహితులు అరుదుగా ఉంటారు. ఇక ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు పై చేయిగా ఉండాలని భావించే సినిమా పరిశ్రమలో మరీ అరుదుగా ఉంటారు. ఆ అరుదైన లిస్ట్ లోనే చేరారు మన ఆర్ఆర్ఆర్ స్టార్స్. యస్.. లేటెస్ట్ గా రామ్ చరణ్‌ చేసిన ఒక పనికి ఎంటైర్ ఇండస్ట్రీ ఫిదా అవుతోంది. మరి అతనేం చేశాడో తెలియాలంటే అసలు కథేంటో తెలియాలి.


ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తే ఎన్టీఆర్ తో మాత్రమే సినిమా చేస్తానని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడుగా ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు అంతకు ముందు సుకుమార్ తో పనిచేసిన హీరోలందరికీ తెలుసు. అందుకే అతను కథ చెప్పినప్పుడు ఓకే చెప్పాడు ఎన్టీఆర్. ఇదో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా అన్నారు ఆ మధ్య. పైగా ఎన్టీఆర్ కోసం పెద్ది అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసుకున్నాడు బుచ్చిబాబు. అయితే ఇప్పుడు యంగ్ టైగర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ రెండూ పూర్తి కావాలంటే మరో రెండేళ్లు పడుతుంది. ఒక సినిమా తర్వాత ఓ దర్శకుడు అంత కాలం వెయిట్ చేయడం అంత మంచిది కాదు. అందుకే వేరే హీరోను చూసుకోమని చెప్పాడు. కట్ చేస్తే తన గురువు సుకుమార్ సాయంతో బుచ్చిబాబు అదే కథను రామ్ చరణ్‌ కు చెప్పాడు. ఈ దర్శకుడు చెప్పిన కథ చరణ్ కూ బాగా నచ్చింది. అయితే వెంటనే ఎస్ చెప్పలేదు.


ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పి ఉన్నాడని తెలిసిన చరణ్.. ముందు ఈ కథ చేయనా వద్దా అని ఎన్టీఆర్ కు ఫోన్ చేశాడట. తను ఎలాగూ ఇప్పుడప్పుడే చేయలేడు కాబట్టి.. యంగ్ టైగర్ కూడా గో అహెడ్ అనేశాడు. ఎన్టీఆర్ నో అబ్జెక్షన్ అన్న తర్వాతే చరణ్ కూడా బుచ్చిబాబుకు ఎస్ చెప్పాడట. ఓ రకంగా ఇలాంటి సంప్రదాయం టాలీవుడ్ లో ఇంతకు ముందు లేదు.

ఓ మంచి కథ పడితే చాలు.. వెంటనే ఎస్ అని చెప్పడం.. వరకూ మాత్రమే ఇప్పటి వరకూ చూశాం. బట్ చరణ్‌ మాత్రం తన ఫ్రెండ్ కు ఆ విషయం చెప్పి మరీ ఓకే చేశాడు.
ఇక ఈ చిత్రాన్ని ఇంతకు ముందు యూవీ క్రియేషన్స్ చేస్తుందని చెప్పారు. కానీ వెంకట సతీష్‌ కిలారు అనే ఓ కొత్త నిర్మాత చేస్తున్నాడు. అతనికీ.. తన శిష్యుడికి తోడుగా సుకుమార్ కూడా ప్రొడక్షన్ లో పార్టనర్ గా జాయిన్ అయ్యాడు. డిసెంబర్ లో ఓపెనింగ్ జరుపుకుని వచ్చే జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. మొత్తంగా చరణ్ – ఎన్టీఆర్ ల బాండింగ్ ఈ మేటర తో మరోసారి హాట్ టాపిక్ అయింది.

, , , , , , , , , ,