ad

నన్నయ రాసిన కావ్యం ఆగితే తిక్కన పూర్తి చేశాడు. రాధ పాట మధురిమను కృష్ణుడు పూర్తి చేశాడట.. మరి 18పేజీల్లో ప్రేమకథను ఎవరు పూర్తి చేయబోతున్నారు.. అంటే వెండితెరపై చూడాలి అంటారు కదా..? యస్.. ఇదంతా నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించి 18పేజెస్ మూవీ గురించే. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకూ అంటారా..? లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదలైంది.. అందుకు.
ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ కైనా గ్యాప్ రాకూడదు. వస్తే జనం మర్చిపోతారు. కానీ ఈ మాటను అందరికీ వర్తింపచేసింది కరోనా. అందుకే 2019లో అర్జున్ సురవరం అనే సినిమాతో వచ్చిన నిఖిల్ మళ్లీ ఇన్నాళ్లకు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అర్జున్ సురరం కూడా ఆలస్యంగా విడుదలైనా మంచి విజయం సాధించింది. అతని లేటెస్ట్ మూవీ 18 పేజెస్ కూడా కరోనా కారణంగా ఆలస్యంగానే వస్తోంది. ఈ చిత్రాన్ని కుమారి 21ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ రూపొందించాడు. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ చిత్రంపై ముందు నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ టీజర్ కొత్తగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి టీజర్ రాలేదనే చెప్పాలి. వైవిధ్యమైన కంటెంట్ తో వస్తున్నట్టుగా ఈ టీజర్ చూస్తే అర్థమౌతోంది. అనుపమ రాసుకున్న డైరీ నిఖిల్ కు దొరకడం అనే పాయింట్ కాస్త పాతదే అయినా.. ట్రీట్మెంట్ ఏదో కొత్తగానే ఉండేలా ఉంది. ఇక టీజర్ లో వినిపించిన గీతం వినసొంపుగా సినిమా కథనానికి దగ్గరగా ఉంది. ఇక ఈ వేసవిలోనే విడుదల చేస్తాం అని ప్రకటించారు కానీ సరైన డేట్ మాత్రం చెప్పలేదు. మరి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుందాం..

, , , , , , , , , , , , , , ,