Advertisement
బాలయ్య ఫాన్స్ కిక్ ఇచ్చే న్యూస్..
Latest Tollywood Viral News

బాలయ్య ఫాన్స్ కిక్ ఇచ్చే న్యూస్..

Advertisement

అఖండ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు బాలయ్య. అటు ఫస్ట్ టైం చేసిన టాక్ షో హిట్ అవడం ఆ షోతో ఇప్పటివరకు ఆయనపై ఉన్న ఇమేజ్ కూడా మారిపోయింది. ఇక తన తరం హీరోల్లో ఇప్పటికీ బాలయ్యకు మాత్రమే బెన్ఫిట్ షోస్, బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి. అందుకే ఆయన కూడా ఎక్కడ తగ్గకుండా తన ఇమేజ్ ని మ్యాచ్ చేసే కథలతోనే వస్తున్నాడు. చాల రోజుల తర్వాత మరోసారి బోయపాటితో చేసిన అఖండ టైటిల్ తగ్గట్టుగానే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ ఊపులోనే ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతానికి ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ కి ” జై బాలయ్య” అనే టైటిల్ ను ఫిక్స్ చేసేసారు అని టాక్. ఇక ఈ నెలలో బాలయ్య బర్త్ డే సందర్బంగా ఫాన్స్ కి అద్భుతమైన ట్రీట్ ఇవ్వబోతున్నాడు.

ఈ నెల ౧౦న బాలయ్య బర్త్ డే.. ఆ రోజున మూవీ టైటిల్ తో పాటు ఒక ఊర మాస్ టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి మొన్న పెద్ద ఎన్ఠీఆర్ బర్త్ డే రోజునే టైటిల్ అనౌన్స్ చేయాలనుకున్నారు. తన బర్త్ డే కి పెద్ద టైం లేదు కాబట్టి ఆ రోజు స్టిల్ విడుదల చేసారు. ఇప్పుడు బాలయ్య బర్త్ డే టైం కి టైటిల్ తో పటు టీజర్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ టీజర్ తో మూవీ పై ఒక భారీ హైప్ వచ్చేలా ప్లాన్ చేశారట. అంటే అఖండ టీజర్స్ తో బిజినెస్ వర్గాల్లో ఎలా ఐతే ఇంట్రెస్ట్ పెంచారో ఇప్పుడు జై బాలయ్య మూవీ విషయంలో కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారన్నమాట. అంటే ఈ టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ నటిస్తోన్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ విల్లన్ నటిస్తున్నాడు. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా క్రాక్ మూవీతో భారీ హిట్ కొట్టాడు కాబట్టి ఈ కాంబో పైన మంచి అంచనాలున్నాయి. అవి ఏ రేంజ్ లో ఉటాయి అనేది టీజర్ వచ్చాక తెలుస్తుంది. సో బాలయ్య అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ రెడీ అవుతుందన్నమాట.

Advertisement