కొందరు హీరోయిన్లకు తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ పై అందంగా కనిపించడమే కాదు.. బిజనెస్ లోనూ ఆ బ్యూటీ యాడ్ అవుతుంది. అందుకే వారికి అదే రేంజ్ లో డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్స్ ను తీర్చగలిగితే డేట్స్ ఇస్తారు. అలాంటి హీరోయిన్లలో సౌత్ నుంచి ఈ తరంలో ఉన్న ఏకైక హీరోయిన్ నయనతార మాత్రమే.. అంటే అతిశయోక్తి కాదు. అఫ్ కోర్స్ రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందనుకోండి. అయినా తనే కావాలని బాలయ్య కోసం మరోసారి తీసుకువస్తున్నారట. మరి ఇది నిజమా.. రూమరా..? అనేది ఇంకా తేలాల్సి ఉంది.నయనతారకు ఇప్పుడు ఓ మీడియం రేంజ్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది. మార్కెట్ కూడా అలాగే ఉంది.

ఆ మార్కెట్ ను బట్టే తను కూడా భారీ రెమ్యూనరేషనస్ డిమాండ్ చేస్తుంది. అయినా నిర్మాతలు క్యూ కడుతున్నారు.ఆ క్యూ తెలుగు నుంచి కాస్త తక్కువగానే ఉన్నా.. కోలీవుడ్ లో మాత్రం తిరుగులేని రేంజ్ లో ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా షారుఖ్ సరసన సినిమాతో ఎంట్రీ ఇస్తోన్న నయన్.. తెలుగులో బాలకృష్ణతో బెస్ట్ పెయిర్ అనిపించుకుంది. వీరి కాంబోలో వచ్చిన సింహా, శ్రీ రామరాజ్యం, జై సింహా.. మూడు సినిమాలూ బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. ఆ క్రేజ్ ను కంటిన్యూ చేసేందుకు మరోసారి బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నయన్ ను తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తోన్న సినిమా ఇది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు బాలయ్య. ఈ మూవీలో హీరోయిన్ గానే నయనతారను తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా అంటే నయన్ మొదట్నుంచీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా బాలయ్య అంటే ఓకే అనే అవకాశాలున్నాయి. అలాగని రెమ్యూనరేషన్ లో ఏ మార్పూ ఉండదు. తను అడిగినంతా ఇస్తే.. అనిల్ రావిపూడి – బాలయ్య సినిమాలో హీరోయిన్ గా యస్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. మరి తన డిమాండ్ కు తగ్గ ఫీజ్ ఇచ్చుకోగలిగితే మరోసారి నయన్ బాలయ్య జంట వెండితెరపై సందడి చేస్తుందన్నమాట.

, , , , , ,