సిల్వర్‌స్క్రీన్‌ మీద ప్రతి శుక్రవారం ఓ ఆసక్తికరమైన పోటీ నడుస్తుంటుంది. రిలీజయ్యే సినిమాలు ఎలాగైనా ప్రేక్షకుల ఆదరణ పొందాలనే టెన్షన్‌లో మేకర్స్ ఉంటారు. కానీ హీరో, హీరోయిన్ల పరిస్థితి మాత్రం అంతకు ఇంకో రకంగా ఉంటుంది. వాళ్ల ఆలోచన కేవలం తమ సినిమాల వరకే పరిమితం కాదు. ఆ వారం వచ్చే సినిమాలతో పాటు, అంతకు ముందు, ఆ తర్వాత వచ్చే సినిమాల మీద కూడా నజర్‌ ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్‌ ఫస్టాఫ్‌లో అలాంటి ఇంట్రస్టింగ్‌ పోటీ ముగ్గురు హీరోయిన్ల మధ్య కనిపిస్తోంది.చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌ అక్టోబర్‌ 5న విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో చిరంజీవికి జోడీ ఎవరనే విషయాన్ని ఇప్పటిదాకా సస్పెన్స్ లో ఉంచారు. మలయాళ ఒరిజినల్‌ లూసిఫర్‌లో అయితే మోహన్‌లాల్‌కి జోడీ లేదు. సిస్టర్‌ రోల్‌ మాత్రం ప్రధానంగా సాగుతుంది. గాడ్‌ఫాదర్‌లో తెలుగులో చిరంజీవి సిస్టర్‌గా నటిస్తున్నారు నయనతార. ఆమె పెళ్లయిన తర్వాత విడుదలవుతున్న సినిమా ఇదే. దానికి తోడు హిందీలోనూ విడుదలవుతోంది గాడ్‌ఫాదర్‌. ఆల్రెడీ చిరంజీవి సైరా నరసింహారెడ్డితో హిందీ జనాలను పలకరించారు నయన్‌. ఇప్పుడు మెగాస్టార్‌తో కలిసి రెండో సారి నార్త్ బెల్ట్ కి హాయ్‌ చెప్పబోతున్నారు.లాస్ట్ ఇయర్‌ డిసెంబర్‌లో పుష్ప మూవీతో నార్త్ జనాలను పలకరించి సామి సామి అంటూ హిట్‌ మార్కులు వేయించుకున్నారు శ్రీవల్లి.

ఆ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు గుడ్‌బై ప్రమోషన్లలో జోరుగా పార్టిసిపేట్‌ చేస్తున్నారు. గుడ్‌బై సినిమా అక్టోబర్‌ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషనల్‌ కంటెంట్‌కి ఆల్రెడీ బెస్ట్ రెస్పాన్స్ వస్తోంది. రష్మిక అక్కడి జనాలకు హాయ్‌ చెప్పిన వారానికి, అంటే అక్టోబర్‌ 14న డాక్టర్‌ జీతో నార్త్ వాళ్లను పలకరించనున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఇప్పటిదాకా నార్త్ లో ఒన్లీ సీనియర్‌ హీరోలతోనే కనిపించిన రకుల్‌, ఇప్పుడు ఓ యంగ్‌హీరోతో చేసిన సినిమా డాక్టర్‌జీ. ఆయుష్మాన్‌ ఖురానాతో ఆమె జోడీ కట్టిన ఈ సినిమా మీద కూడా అక్కడ మంచి బజ్‌ ఉంది.సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ అయ్యే సినిమాలో ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, త్రిష, శోభిత ధూళిపాళ ఎలాగూ స్క్రీన్‌ మీద రంగులు పంచుతారు. ఆ తర్వాత ఇంకో 15 రోజుల పాటు కూడా మన నాయికలు నార్త్ వాళ్లకు వినోదాన్ని పంచడానికి రెడీ అవుతున్నారు. నయన్‌, రష్మిక అండ్‌ రకుల్‌… అక్టోబర్‌ ఫస్టాఫ్‌లో ఈ ముగ్గురిలో ఎవరికి గెలుపు దక్కుతుందో చూడాలి.

, , , , , , , ,