నేచురల్ స్టార్ గా టాలీవుడ్ లో తనదైన ముద్రను బలంగా వేసిన హీరో నాని. ఫ్యామిలీ ఆడియన్స్ లో అతనికి తిరుగులేని ఇమేజ్ ఉంది. స్టార్ హీరోలు కూడా అభిమానించేంతగి ఫిల్మీ హిస్టరీ కూడా ఉంది. అలాంటి నాని తన ఇమేజ్ ను మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడిప్పుడు. కొన్నాళ్లుగా కొత్త కథలు ట్రై చేస్తున్నాడు. అలా వచ్చిన వి, టక్ జగదీష్ ఓటిటి లోనూ ఆకట్టుకోలేకపోయాయి. అయితే రీసెంట్ గా వచ్చిన శ్యామ్ సింగరాయ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. మళ్లీ అంటే సుందరానికి అంతగా మెప్పించలేకపోయింది. ఇక శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో దసరా అనే సినిమా చేస్తున్నాడు.

టైటిల్అనౌన్స్ మెంట్ నుంచి రీసెంట్ గా వచ్చిన వీడియో వరకూ ఈ మూవీని చూస్తోంటో ఓ ఊరమాస్ రగ్గ్ డ్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న దసరా మూవీని వచ్చే యేడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.


విశేషం ఏంటంటే.. ఎప్పుడూ రెండు మూడు సినిమాలు లైన్ లో పెట్టుకుని ఉండే నాని ఈ సారి ఆ లైనప్ ను చూపించడం లేదు. అంటే కొత్త సినిమాలేం కమిట్ కాలేదు ఇంకా. ఇంతకు ముందు ఒక సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పి ఉండేవాడు. మరి ఈ సారి ఎందుకు గ్యాప్ తీసుకున్నాడో కానీ దసరా చివరి స్టేజ్ కు వచ్చింది అని తెలుస్తోంది. దీంతో కొత్త సినిమా ప్రయత్నం మొదలుపెట్టాడు. గతంలో తనతో శ్రీ కృష్ణార్జున యుద్ధం వంటి ప్లాప్ మూవీ తీసిన మేర్లపాక గాంధీతో మరోసారి సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.


ప్రస్తుతం మేర్లపాక గాంధీ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా విడుదలైన టీజర్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ట్రెండ్ కు తగ్గ కథలా ఉంది. సంతోష్ శోభన్, ఫారియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ రిజల్ట్ ను బట్టి నాని సినిమా చేస్తాడా లేక ఈ రిజల్ట్ ఏమైనా ప్రాజెక్ట్ ఉంటుందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. అయితే గాంధీ వినిపించిన లైన్ కు నాని బాగా ఇంప్రెస్ అయ్యాడట. అందుకే లైక్ షేర్ సబ్ స్క్రైబ్ రిజల్ట్ తో పనిలేకుండానే గాంధీతో సినిమా చేసే అవకాశాలున్నాయంటున్నారు. మరి గతంలో వచ్చిన శ్రీ కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అయినా మళ్లీ గాంధీని నమ్ముతున్నాడంటే అతను చెప్పిన కథలో కూడా దమ్ము ఉందనే అనుకోవచ్చా..?

, ,