Advertisement
దసరా సందడి మొదలుపెట్టిన నాని
Latest Movies Tollywood

దసరా సందడి మొదలుపెట్టిన నాని

Advertisement

శ్యామ్ సింగరాయ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాకు విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అదనంగా రావడంతో మరింత హ్యాపీగా ఉన్నాడు. శ్యామ్ సింగరాయ్ తర్వాత అంటే సుందరానికి చిత్రాన్ని పూర్తి చేశాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీలో మళయాల నటి నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక లేటెస్ట్ గా ఆ మధ్య వెరీ ఇంట్రెస్టింగ్ గా అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ‘దసరా’చిత్రాన్ని ప్రారంభించారు. ఓదెల శ్రీకాంత్ దర్శకుడుగా పరిచయం అవుతోన్న దసరాకు చెరుకూరి సుధాకర్ నిర్మాత. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకు ముందు కీర్తి సురేష్, నాని కలిసి నేను లోకల్ చిత్రంలో నటించారు. మొత్తంగా ఈ రోజు సినిమా అఫీషియల్ గా ప్రారంభం అయింది.
కొన్నాళ్ల క్రితం దసరా మూవీ థీమ్ ను విడుదల చేశారు. ఆ థీమ్ ను బట్టి చూస్తే ఇది తెలంగాణ ప్రాంతంలోని సింగరేణి నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకూ పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్స్ తోనే ఎక్కువగా ఆకట్టుకున్న నాని ఈ మూవీతో ఫస్ట్ టైమ్ ఓ అగ్రెసివ్ రోల్ ప్లే చేస్తున్నాడంటున్నారు. మామూలుగా సింగరేణి నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలకు సంబంధించిన కథే ఇది కూడా అని చెప్పుకుంటున్నారు. ఆ మోషన్ పోస్టర్ కూడా అదే ఎలివేట్ చేసింది.
ఇక ఈ చిత్రానికి ఇలాంటి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇలాంటి రియలిస్టిక్ కథలకు సంతోష్ తమిళ్ లో అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు. ఆ కారణంగానే అతన్ని తీసుకున్నారనుకోవచ్చు. ఈ దసరా సినిమాను దసరా పండగకే విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఈ దసరా ఆ దసరాలా సందడి చేస్తుందా లేదా అనేది చూడాలి.

Advertisement