Advertisement
రిస్క్ చేస్తున్న నాని. స‌క్స‌స్ వ‌చ్చేనా..?
Latest Movies Tollywood

రిస్క్ చేస్తున్న నాని. స‌క్స‌స్ వ‌చ్చేనా..?

Advertisement

నేచుర‌ల్ స్టార్ నాని ఆమ‌ధ్య వ‌రుస‌గా స‌క్స‌స్ లు సాధించారు. అయితే.. ఈమ‌ధ్య కెరీర్ లో వెన‌క‌బ‌డ్డాడు.
ఓటీటీలో రిలీజ్ చేసిన రెండు సినిమాలు వి, ట‌క్ జ‌గ‌దీష్ నానికి ఆశించిన విజ‌యాన్ని అందివ్వ‌లేదు. దీంతో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రం క్రిస్మ‌స్ కానుక‌గా థియేట‌ర్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌టుగ్గానే స‌క్స‌స్ సాధించింది. పుష్ప రిలీజైన త‌ర్వాత వారంలో శ్యామ్ సింగ రాయ్ విడుద‌ల అయిన‌ప్ప‌టికీ… స‌క్స‌స్ సాధించ‌డం విశేషం.

ఇదిలా ఉంటే… నాని ద‌స‌రా అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో నాని స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తుంది. నేను లోక‌ల్ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాలో నాని కాస్త నెగిటివ్ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్ చేస్తున్నార‌ని తెలిసింది. వి సినిమా త‌ర‌హా నెగిటివ్ క్యారెక్ట‌ర్ కాక‌పోయినా.. మంచి వాడు చెడ్డ‌ప‌నులు చేయాల్సివ‌స్తే.. ఎలా ఉంటుంది అనేలా క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ట‌.

నెగిటివ్ ట‌చ్ తో ఉన్న క్యారెక్ట‌ర్ చేసిన వి సినిమా ఫెయిల్ అయ్యింది. అయిన‌ప్ప‌టికీ… మ‌ళ్లీ నెగిటివ్ ట‌చ్ ఉన్న పాత్ర చేయ‌డం అంటే రిస్కే అని చెప్ప‌చ్చు. మ‌రి.. రిస్క్ చేస్తున్న నానికి ద‌స‌రా చిత్రం స‌క్స‌స్ అందిస్తుందో..? లేదో..? చూడాలి.

Advertisement