ad

నేచురల్ స్టార్ నాని కూడా రామ్ చరణ్ రూట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. అలాగని చరణ్ ను ఫాలో అవుతున్నాడు అని కాదు. బట్.. స్టోరీ సెలక్షన్ లో అతని ఇన్సిస్పిరేషన్ నానిలో కనిపిస్తోంది. ఆ మాటకొస్తే నాని మాత్రమే కాదు.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ చాలామంది స్టార్లు కథల విషయాలో మూలాల్లోకి వెళుతున్నారు. రూట్ లెవల్ స్టోరీస్ తో హిట్ కొట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఒకప్పుడు సినిమా కథంటే.. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, ఓ ప్రేమకథ.. దాన్ని జయించడం.. లేదంటే పాటలు ఫైట్లు కామన్ గా.. ఓ పేద్ద విలన్ ను ఎదురించే హీరో.. వాస్తవాతీతమైన కథనం.. కాస్త అటూ ఇటూగా ఇవే కథలు యేళ్ల తరబడిత వెండితెరపై కనిపించాయి. కానీ ఇప్పుడు కథలు మారుతున్నాయి. అలాగని ఫార్ములా మిస్ కావడం లేదు. కేవలం ఫార్మాట్ ఛేంజ్ అవుతోంది. కథల నేపథ్యాలు మారుతున్నాయి. కథనం వాస్తవానికి కాస్త దగ్గరగా వస్తోంది. ఈ ట్రెండ్ తమిళ్ సినిమాల్లో ఎప్పటి నుంచో ఉంది. మన దగ్గర మాత్రం ఎనభైల్లోనే ఆగిపోయింది. బట్ ఇప్పుడు మళ్లీ కొత్త కథలు వస్తున్నాయి.. అందులో భాగంగానే టాప్ హీరో, టాప్ డైరెక్టర్ వంటి వారు కూడా రంగస్థలం వంటి సినిమాతో మెప్పించారు.
రంగస్థలం ఒక సామాజివ వివక్షపై అల్లుకున్న కథ. గ్రామీణ భారతంలోని అన్ని సమాజాల జీవన విధానాలను చూపించిన కథ. ఆ తర్వాత అలాంటివి పెరుగుతున్నాయి. అణచబడ్డ జాతుల వారు హీరోలుగా మారుతోన్న తరుణానికి రంగస్థలం ఓ దిక్సూచిగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నా.. టాప్ హీరోలు కూడా ఇలాంటివి చేయొచ్చు అనే ధైర్యానికి ఈ సినిమా విజయం ఓ ఉత్సాహాన్నిచ్చింది. అందుకే అణచివేతకు గురైన వాడే తిరుగుబాటు మొదలుపెడతాడు అనే ఫార్ములాలో మన దగ్గరా కథలు పెరుగుతున్నాయి. అచ్చంగా ఇలాగే అని చెప్పలేం కానీ నాని కూడా శ్యామ్ సింగరాయ్ లో అలాంటి వర్గం కోసం పోరాటం సాగించినవాడుగా కనిపించాడు.
ఇక త్వరలోనే రాబోతోన్న నాని సినిమా దసరా గురించి సరికొత్త విశేషాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా సామాజిక వివక్ష చుట్టూ సాగే కథే అంటున్నారు. హీరో కూడా రంగస్థలంలో రామ్ చరణ్ లాగా అణచివేయబడిన వాడి నుంచి తిరుగుబాటు మొదలుపెట్టేవాడిగా కనిపిస్తాడట. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్ లో అతని ఆహార్యం అలాగే ఉంది. పైగా సింగరేణి నేపథ్యంలో ఇలాంటి కథలకు కొదవలేదు. అందుకే నాని ఈ కొత్త కథకు బాగా కనెక్ట్ అయ్యాడు అంటున్నారు. ఇక శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
కమర్షియల్ ఫార్మాట్ కథలకే ఒకప్పుడు మంచి బిజినెస్ ఉండేది. కానీ ఇప్పుడు బలహీనమైన నేపథ్యాల్లో బలమైన కమర్షియల్ యాంగిల్ ను జోడించి చెప్పే కథలకు కూడా మంచి వ్యాపారం సాగుతోంది. అందుకే దసరా చిత్రానికి 45కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్ పూర్తయింది. అంటే ఓటిటి, శాటిలైట్ రూపంలో నిర్మాతలకు టేబిల్ ప్రాఫిట్ వచ్చేసింది అనుకోవచ్చు. పైగా ఈ మూవీని ప్యాన్ ఇండియన్ స్థాయిలో విడుదల చేస్తున్నారు. కాబట్టి థియేట్రికల్ బిజినెస్ కూడా బానే అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఇంకా సగం షూటింగ్ కూడా పూర్తి కాకుండా బిజినెస్ వర్గాల్లో క్రేజ్ సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

 

, , , , , , ,