Advertisement
“అఖండ” గురించి న‌గ్మా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Latest Movies Regional Tollywood

“అఖండ” గురించి న‌గ్మా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Advertisement

నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించిన చిత్రం అఖండ‌. బాల‌య్య స‌ర‌స‌న‌ ప్ర‌గ్యా జైస్వాల్ న‌టించింది. డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన‌ ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ములేపుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. సినీ అభిమానుల ఎవ‌రి నోట విన్నా అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ అనే టాకే వినిపిస్తోంది. దీంతో సోష‌ల్ మీడియాలో అఖండ హాట్ టాపిక్ అయ్యింది.

బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కు 100కు పైగా సినిమాల్లో న‌టించారు అయిన‌ప్ప‌టికీ బాల‌య్య కెరీర్ లో బెస్ట్ మూవీ అఖండ అని అంటున్నారు నంద‌మూరి అభిమానులు. ఈ సినిమాను చూసేందుకు సినీ అభిమానులు ధియేట‌ర్ల వైపు ప‌రుగులు తీస్తున్నారు. ఈ సినిమా గురించి సినీ రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పై ప్ర‌ముఖ సినీ న‌టి న‌గ్మా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సినిమాను చూసిన న‌గ్మా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ.. బాల‌య్య బాబు గారి అఖండ సినిమా అద్భుతంగా ఉంద‌ని.. ఆయ‌న న‌ట‌న అయితే వేరే లెవ‌ల్ లో ఉంద‌ని పేర్కొన్నారు.

అంతే కాకుండా అఘోరా పాత్ర‌లో అయితే జీవించేశార‌ని.. ఆ పాత్ర‌ను తెర‌కెక్కించిన విధానం కూడా చాలా బాగుంద‌ని న‌గ్మా అన్నారు. చాలా రోజుల త‌ర్వాత అఖండ సినిమాలో బాల‌య్య బాబు న‌ట విశ్వ‌రూపం చూపించార‌ని చిత్ర‌యూనిట్ కి త‌న ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలియ‌చేశారు. దీంతో న‌గ్మా బాల‌య్య అఖండ సినిమా గురించి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement