Advertisement
టైమ్ ట్రావెల్ మిషన్ లోకి నాగచైతన్య..?
Latest Movies Tollywood

టైమ్ ట్రావెల్ మిషన్ లోకి నాగచైతన్య..?

Advertisement

ఫిక్షన్ కథలను ఇష్టపడని వారు ఉండరు. చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకూ ఓ ఊహా లోకాన్ని చూస్తున్నప్పుడు ఆహా అనేసుకుంటారు. అందుకే ఫిక్షన్ కథలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు జానపదాల్లో ఈ తరహా కథలు చూశాం. తర్వాత ఆదిత్య 369తో అద్భుతం అనేశారు ప్రేక్షకులు. ఇందులో టైమ్ ట్రావెల్ అనేది ప్రధాన ఆకర్షణ. ఆ తర్వాత ఈ తరహాలో కొన్ని సినిమాలు వచ్చినా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే లేటెస్ట్ గా ఇలాంటి కథలో నటించేందుకు రెడీగా ఉన్నాడు నాగచైతన్య అంటున్నారు.
చైతూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే నందినీ రెడ్డితోనూ ఓ మూవీ ఉంటుంది అన్నారు. కానీ గ్యారెంటీ లేదు అనే వార్తలూ వస్తున్నాయి. అదే టైమ్ లో వెబ్ సిరీస్ కూడా చేయాలి. ఈ టైమ్ లో టైమ్ ట్రావెల్ మూవీ అనే వార్త కొంత ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ తో ఆకట్టుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో సినిమా ఈ టైమ్ ట్రావెల్ మూవీ ఉంటుందట. శ్యామ్ సింగరాయ్ ముందు సితార బ్యానర్ లో చేయాల్సి ఉంది. మిస్ అయింది. అందుకే రాహుల్ నెక్ట్స్ మూవీ ఈ బ్యానర్ లో ఉంటుంది. వారికే ఈ టైమ్ ట్రావెల్ కథ చెప్పి ఒప్పించాడట. రాహుల్ రాసుకున్న టైమ్ ట్రావెల్ కథ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో ఓ హాట్ డిస్కషన్ నడుస్తోంది. అందుకే చాలామంది ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ కథకు నాగచైతన్య బావుంటాడని మేకర్స్ భావించారట. అతన్ని సంప్రదించినట్టూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత అనేది చెప్పలేం కానీ.. చైతూ తను ఆల్రెడీ విన్న లైన్స్ కంటే ఈ కథ బావుంటే మాత్రం ఖచ్చితంగా ముందు ఈ ప్రాజెక్టే పట్టాలెక్కుతుంది. ఏదేమైనా టైమ్ ట్రావెల్ అంటే బోలెడంత ఫిక్షన్ కు ఆస్కారం ఉంటుంది. అది కాస్త బలమైన కథతో ఉంటే ఓ బ్లాక్ బస్టర్ కొట్టేయొచ్చు. మరి చైతూ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబుతాడా లేదా అనేది చూడాలి.

Advertisement