ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య ఇటీవల తన తదుపరి సినిమాలు ఒకదానికొకటి భిన్నంగా, కమర్షియల్ గా విజయాలు అందుకునే చిత్రాలుగా ఉంటాయని ప్రకటించారు. ఈరోజు ఆయన 24వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.#NS24 చిత్రానికి ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వం వహించనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా నాగశౌర్యకు పర్ఫెక్ట్ యాప్ట్ స్క్రిప్ట్.వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

దర్శకుడు ఎస్‌ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో  తెలియజేస్తారు.

, , ,