మొదటి సినిమాతోనే అందరినీ మెప్పించడం అంత సులువు కాదు. కొందరు మాత్రమే అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాంటి దర్శకుల్లో వేణు ఊడుగుల ఒకడు. ఫస్ట్ మూవీ నీదీనాదీ ఒకే కథతో విమర్శకులను సైతం మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమా కమర్షియల్ కూడా ఓకే అనిపించుకుంది. దీంతో చాలామంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చారు. ఆ తర్వాత అతను అత్యంత ఎక్కువ అటెన్షన్ తో చేసిన సినిమా విరాట పర్వం. విడుదలకు ముందు ఈ చిత్రం గురించి ఎన్నో కథనాలు వినిపించాయి. ఇదో వండర్ మూవీ అనీ.. పాథ్ బ్రేకింగ్ అవుతుందనీ.. తెలుగులో ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ రాలేదని ఓ చాలా చెప్పేసుకున్నారు. బట్.. రిలీజ్ తర్వాత అవన్నీ తేలిపోయాయి. వెరీ యావరేజ్ స్టోరీ, స్క్రీన్ ప్లేగా తేల్చారు ఆడియన్స్. పైగా అప్పటి వరకూ సినిమా గురించి చెప్పుకున్న డెప్త్ సైతం మిస్ అయింది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ రిజల్ట్ దర్శకుడు వేణు ఊడుగులను డిఫెన్స్ లోకి నెట్టేసింది.

విరాట పర్వం చిత్రానికి ముందు వరకూ వేణుకు ఓ పెద్ద బ్యానర్ భారీ అడ్వాన్స్ ఇచ్చిందనీ.. అతను చెప్పిన స్టోరీ లైన్ కు తగ్గట్టుగా ఓ పెద్ద స్టార్ హీరోనే ఇస్తామని ప్రామిస్ చేసిందని న్యూస్ వచ్చాయి. బట్ ఈ మూవీ రిజల్ట్ తర్వాత బడ్జెట్ తగ్గింది. స్టార్ హీరో కూడా కుదరలేదు. బట్.. కథ మారలేదు. ఆ కథ అద్భుతం అని ఇప్పటికే ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ కథలోకి ఇప్పుడు నాగ చైతన్య వచ్చాడు. యస్.. చైతూ కెరీర్ లో ఇప్పటి వరకూ ఇలాంటి కథ చేయలేదు అనే రేంజ్ లో ఈ స్టోరీ ఉండబోతోందట. వేణు స్టైల్ కు తగ్గట్టుగానే మరోసారి రెబల్ యంగ్ స్టర్ కథగా ఈ మూవీ ఉంటుందని టాక్.

ఇప్పటి వరకూ మోస్ట్ ప్రామిసింగ్ బ్యానర్ అనే పేరు తెచ్చుకున్న ఓ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందంటున్నారు. ప్రస్తుతం బౌండ్ స్క్రిప్ట్(విత్ డైలాగ్స్) ను రెడీ చేసే పనిలో ఉంది టీమ్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ వస్తుంది.ప్రస్తుతం చైతూ తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు. ఇది అతని కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ విడుదల కాబోతోన్న ఈ మూవీతో చైతూ బౌన్స్ బ్యాక్ అవుతాడంటున్నారు. అందుకు కారణం వెంకట్ ప్రభు టాలెంటే. వెంకట్ ఇప్పటికే హైలీ టాలెంటెడ్ అన్న పేరు తెచ్చుకున్నాడు. అన్నట్టు ఇతను ఎవరో కాదు.. ఇళయారాజా తమ్ముడు గంగై అమరన్ కొడుకు.

, , , ,