ఏ స్టార్ అయినా తను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయకూడదు. తను ఏం చేస్తే ఆడియన్స్ ఆదరిస్తున్నారో ఆ యాంగిల్ లో ఆలోచించాలి. ఈ విషయంలో కాస్త ఆలస్యం చేసినా ఫైనల్ గా ట్రాక లోకి వచ్చాడు అక్కినేని నాగచైతన్య. మజిలీ నుంచి వరుసగా విజయాలు అందుకుంటున్నాడు. వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు అంటూ హ్యాట్రిక్ ను కూడా దాటేశాడు. మధ్యలో పర్సనల్ లైఫ్ కాస్త డిస్ట్రబ్ అయినా.. సినిమాలపై కాన్ సెంట్రేషన్ తగ్గించలేదు. బంగార్రాజుతో పాటే విక్రమ్ కుమార్ తో సినిమా అనౌన్స్ అయింది. థ్యాంక్యూ అనే టైటిల్ తో మొదలైన ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ ను ఊహించిన దానికంటే చాలా ఆలస్యంగానే ఇస్తూ వస్తున్నారు.
థ్యాంక్యూ లో నాగ చైతన్య సరసన రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమమ్ తర్వాత చైతూ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమా ఇదే. ఇక విక్రమ్ కుమార్ కెరీర్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉంది. అయినా తమతో మనం సినిమా చేశాడనే కారణంగానే చైతూ ఈ ఆఫర్ ఇచ్చాడనుకోలేం. ఇప్పటి వరకూ కేవలం ఫస్ట్ లుక్స్ తో మాత్రమే సరిపెట్టుకున్న ఈ మూవీ టీమ్ లేటెస్ట్ గా రిలీజ్ డేట్ నే అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. చాలామంది ఈ చిత్రం సమ్మర్ లోనే వస్తుందనుకున్నారు. కానీ సమ్మర్ చాలా ప్యాక్డ్ గా ఉండటంతో వెనక్కి వెళ్లారు.
థ్యాంక్యూ సినిమాను జూలై 8న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించింది టీమ్. ఆ తర్వాతి రోజు నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం వస్తోంది. అంటే పెద్దగా పోటీ అయితే లేదనే చెప్పాలి. థ్యాంక్యూ షూటింగ్ గతంలోనే పూర్తయింది. ఆ వెంటనే ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూనే విక్రమ్ కుమార్ తోనే దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు చైతూ. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రాబోతోందట. అలాగే మోస్ట్ టాలెంటెడ్ తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతోనూ ఓ మూవీ ఓపెన్ అయింది. అటు బాలీవుడ్ లో నటించిన లాల్ సింగ్ ఛద్దా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తంగా ఎలా చూసినా అన్నీ ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ గానే కనిపిస్తున్నాయి. మరి ముందుగా వస్తోన్న థ్యాంక్యూ తో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.

, , , , , , , , , , , , , , , , , , , , , , , ,