ఈ అక్టోబర్‌ వస్తే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని ఏడాది గడిచిపోతుంది. చిలకా గోరింకల్లా అందరి దృష్టిలో ఆనందంగా ఉన్న ఆ జంట, ఉన్నట్టుండి విడాకులు ప్రకటించేసరికి ఒక్కసారిగా టాలీవుడ్‌ ఉలిక్కిపడింది. అప్పట్లో నాగచైతన్య కోసం స్పెషల్‌గా కుకరీ క్లాసులకు అటెండ్‌ అయ్యారు సమంత. సమంతకు నచ్చిన డిషెస్‌ అన్నీ వండిపెట్టేవారు చైతన్య. ఎక్కడికెళ్లినా ఒకరిమీద ఒకరు మరింత కేరింగ్‌గా ఉండేవారు. సమంత ఎక్కడున్నా కోడలుపిల్ల అని నోరారా పిలిచేవారు నాగార్జున. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఆ ఇద్దరూ విడిపోయారు.


విడిపోవడానికి కారణాలేంటని ఇప్పటికీ ఆరా తీస్తూనే ఉన్నారు ఔత్సాహికులు. సౌత్‌లోనే కాదు, నార్త్ లో కూడా వీరిద్దరి విడాకుల గురించి అడపాదడపా ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. వాళ్లిద్దరూ కలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది సమంతకు ఒకసారి ఎదురైన ప్రశ్న. షార్ప్ వస్తువులు ఏవీ లేకుండా చూసుకోమని డైరక్ట్ గా చెప్పేశారు సమంత. అదే ప్రశ్న చైతన్యకు ఎదురైనప్పుడు కూల్‌ ఆన్సర్‌ వచ్చింది. ఒక హగ్‌ ఇచ్చి పలకరించుకుని వెళ్లిపోతాం అని అన్నారు చైతన్య.


వారిద్దరి సంగతి సరే, ఇప్పుడు అదే ప్రశ్న ఇంటిపెద్ద నాగార్జునకు ఎదురైంది. బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో ఉన్న నాగార్జునను చై సామ్‌ విడాకుల గురించి అడిగారు.చైతన్య జీవితంలో అలా జరక్కుండా ఉండాల్సింది. అలాంటివాటిని అతను ఫేస్‌ చేశారు. అది బాధాకరం. అయితే ఇప్పుడు అతను హ్యాపీగా ఉన్నాడు. దానిలో నుంచి బయటపడ్డాడు. ఎవరైనా అలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తాం? బయటపడాలి. అప్పుడే జీవితంలో ఇంకేదో చేయగలుగుతాం అని అన్నారు నాగార్జున. ఆయన మాటలు పెద్దరికంగా ఉన్నాయంటున్నారు అబ్జర్వ్ చేసినవాళ్లు.

, , , , ,