బుల్లితెర యాంకర్ గా కొంతమంది కుర్రకారుకు రాములమ్మగా బాగా ఫేమ్ అయింది శ్రీ ముఖి. తెలంగాణ నుంచి ఉదయభాను తర్వాత బుల్లితెరపై స్టార్డమ్ తెచ్చుకున్న లేడీగా తనను చెప్పొచ్చు. కొన్ని సినిమాల్లోనూ నటించింది. తను ఎంట్రీ ఇచ్చిన టైమ్ కు ఉన్న ట్రెండ్ ను బట్టి అప్పుడప్పుడూ తనూ హాట్ గా కనిపించింది కానీ.. ఎప్పుడూ హద్దులు దాటలేదు. అలాగే హీరోయిన్ గా చేసిన సినిమాల్లోనూ ఇలాంటివేం కనిపించలేదు. నిజానికి తను హీరోయిన్ గా కొనసాగుతుందని చాలామంది భావించినా.. అప్పట్లో నటించిన రెండు మూడు సినిమాలు రిలీజ్ కూడా కాలేదు. దీంతో ఉన్న ప్రొఫెషన్ ను వదులుకోవడం ఎందుకు అనుకుందేమో.. యాంకర్ గానే రాణిస్తోంది. టివిల్లో కనిపిస్తున్నప్పుడు మోడ్రన్ డ్రెస్ లలో ఉన్నా.. ఎక్స్ పోజింగ్ కు దూరంగానే కనిపించే శ్రీ ముఖి ఈ మధ్య ఆ బౌండరీ కూడా దాటేసింది.

ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా లో స్ట్రీమ్ అవుతోన్న ఓ డ్యాన్స్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తోన్న తన డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు టాక్ ఆఫ్‌ ద టౌన్ గా మారింది. ముఖ్యంగా ఈ షో కోసం చేస్తోన్న ఫోటో షూట్స్ లో ఓ రేంజ్ ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతోంది.మరోవైపు మొన్నటి వరకూ కాస్త చబ్బీగా కనిపించింది శ్రీ ముఖి. కానీ ఈ కొత్త ఫోటోషూట్స్ లో మాత్రం సన్నగా కనిపిస్తోంది. బహుశా తను తగ్గానని చెప్పడానికే ఇలా సోయగాలు ఆరబోస్తూ కవ్విస్తోందా లేక మళ్లీ తనను హీరోయిన్ గా ఎవరైనా సంప్రదించొచ్చు అని ఇన్ డైరెక్ట్ గా చెబుతుందా తెలియడం లేదు కానీ.. అమ్మడి అందాల ప్రదర్శన మాత్రం కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఏదేమైనా సడెన్ గా మొదలుపెట్టిన ఈ ఓవర్ ఎక్స్ పోజింగ్ ఆహా కోసమేనా లేక ఇంకాపైనా కొనసాగుతుందా అనేది చూద్దాం.

, , , ,