ఎవరు ఏమనుకున్నా.. హీరోలకుసంబంధించి టాలీవుడ్ లో మూడు నాలుగు ఫ్యామిలీస్ దే హవా. వీరికే ఫ్యాన్ బేస్ పెద్దది. అందుకే ఈ ఫ్యామిలీ హీరోలంతా ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల్లో ఉత్సాహం డబుల్ అవుతుంది. అయితే ఈ విషయంలో నందమూరి హీరోలు కాస్త డిఫరెంట్ గా కనిపిస్తారు.

ఇతర ఫ్యామిలీ హీరోల్లా వీరు తరచూ కలవరు. కలిసినా అంటీముట్టనట్టుగా ఉంటారు అనేందుకు అనేక వేదికలు ఉదాహరణలుగా ఉన్నాయి. బాబాయ్, అబ్బాయ్ లు కలిసి ఒకే వేదికను పంచుకుంటారు అనే వార్తే చాలు.. నందమూరి ఫ్యాన్స్ లో ఓ కొత్త వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది.

అయితే గత నెల 25న జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపు సభకు బాలయ్య, చంద్రబాబు తర్వాత ఎంతమంది ఉన్నా.. జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఎన్నో కళ్లు వెదికాయి అనేది నిజం. అతనొస్తే అటు ఫ్యామిలీ బానే ఉందనే సంకేతాలు వెళతాయి. తర్వాత తెలుగుదేశం పార్టలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. బట్ జూనియర్ వెళ్లలేదు.

అతనికి ఆహ్వానం లేదని అతని సన్నిహితులు చెప్పారు. ఇచ్చాం అని నిర్వాహకులు చెప్పారు. సరే అప్పుడు విజయవాడలో జరిగిన సభ. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది కాబట్టి.. ఈ సారైనా బాబాయ్ అబ్బాయ్ కలిసి వేదికను పంచుకుంటారు. వీరికి తోడుగా చంద్రబాబు కూడా ఉంటారు అనుకుంటే చివరి నిమిషంలో తను ఆ ప్రోగ్రామ్ కు రాలేనని నిరుత్సాహపరిచాడు ఎన్టీఆర్.

అందుకు ప్రధానంగా చెబుతున్న కారణం ఈ శనివారం అతని బర్త్ డే. అందుకోసం కుటుంబంతో కలిసి ముందే కొన్ని ప్లాన్స్ చేసుకున్నాడు. అందుకు విరుద్ధంగా ఈ ప్రోగ్రామ్ వచ్చింది. అయినా తాతగారి కోసం, బాబాయ్ కోసమైనా హైదరాబాద్ సభకు వెళతాడు అనుకున్నవారికి కుదరదని డైరెక్ట్ గానే చెప్పాడు.
ఇక ఈ తతంగం చూస్తున్న ఎవరికైనా అనిపించేది ఒక్కటే. అసలు గొడవ మొత్తం నందమూరి ఫ్యామిలీ వెర్సెస్ ఎన్టీఆరా లేక.. ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య మాత్రమేనా అని.

అంటే కొన్ని పరిస్థితులు చూస్తోంటే వార్ వీరి మధ్యే ఉందనిపిస్తోంది. బాలయ్య చెబితే నందమూరి ఫ్యామిలీ ఆ గీత దాటుతుందనుకోలేం. అందుకు చంద్రబాబు దన్ను కూడా ఉంటుంది. మరి ఎన్టీఆర్ – బాలయ్య మధ్య ఏం జరిగింది..? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అంతెందుకు.. బాలయ్య ఫస్ట్ టైమ్ హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ షోకు ఎవరెవరో స్టార్స్ వెళ్లారు కానీ.. ఎన్టీఆర్ కు ఇన్విటేషన్ లేదు.

ఈ షోలో బాలయ్యతో పాటు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను కూడా చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో కాంక్షించారు. బట్ అది కుదరలేదు. అంటే అంతకు ముందు నుంచే వీరి మధ్య తేడాలున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. దీనికి తోడు ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాలన్నీ బాలయ్య కేంద్రంగానే జరుగుతున్నాయి.

అందుకే ఎన్టీఆర్ ఆ వేదికపైకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అనేది ప్రస్తుతం వినిపిస్తోన్న మాట. మరి ఈ మాటలు ఎలా ఉన్నా.. వారి మధ్య మళ్లీ మాటలు కలుస్తాయా..? బాలయ్య – ఎన్టీఆర్ ఇంకెప్పుడూ ఒకే వేదికపై కనిపించరా..? అనే ప్రశ్నలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి..