ఎన్టీఆర్ అయితే ఏంటి గొప్పా.. నా రేంజ్ కూడా అంతే

స్టార్ హీరో వస్తున్నాడు అంటే అతని తర్వాత కనిపించే నటులంతా హడలిపోవడం ఇప్పుడు చూస్తున్నాం. లేదంటే అతి వినయం ప్రదర్శిస్తుంటారు. ఇంక రెమ్యూనరేషన్స్ లో అయితే హీరోలకు దరిదాపుల్లో కూడా ఎవరూ ఉండరు. ఆ రేంజ్ లో ఉంది ఇప్పుడు పరిస్థితి. బట్ ఒకప్పుడు హీరోల పరిస్థితి అది కాదు. వాళ్ల రెమ్యూనరేషన్ కు దగ్గరగానే ఇతర ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ ఉండేవి. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ సమానంగా మాత్రం ఉండవు. కనీసం ఓ నాలుగైదు వేలైనా తేడాగా ఉండేది.

బట్ కొందరికి మాత్రం ఇది మినహాయింపు. అప్పట్లో స్టార్ హీరో అంటే ఎన్టీఆర్ కదా. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు. అయితే ఈ ఇద్దరికీ సమాన పారితోషికమే ఇచ్చేవారు నిర్మాతలు. ఎవరినీ తక్కువ లేదా ఎక్కువ చేయడం చాలాకాలం పాటు జరగలేదు. అయితే వీరికి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక స్టార్ మరొకరు ఉన్నారు. అతను హీరో కాదు. కమెడియన్. అతనే రాజబాబు. రాజబాబు తెరపై కనిపించగానే కళ్లంతా పెద్దవి చేసుకుని తెలియకుండానే నవ్వేసుకుంటాం. ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో ఆంధ్రా చాప్లిన్ అనిపించుకున్నాడు రాజబాబు.


ఆ రోజుల్లో దర్శకులు, నిర్మాతలు ముందు రాజబాబు డేట్స్ బుక్ చేసుకున్న తర్వాతే హీరో అయినా హీరోయిన్ అయినా అనుకునేవారు. అంతే కాదు.. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ముందు రాజబాబు ఉంటేనే నిర్మాతకు అడ్వాన్స్ లు ఇచ్చేవారు. ఆ రేంజ్ డిమాండ్ ఉండేది మన తెలుగు చాప్లిన్ కు. ఓ సారి ఎన్టీఆర్ నటించే సినిమాకు రాజబాబును బుక్ చేశాడో నిర్మాత. ఈయన తన రెమ్యూనరేషన్ 3