మెగాస్టార్ సినిమా అంటే మాస్ ఫైట్స్ తో పాటు ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే స్టెప్పులు ఎక్స్ పెక్ట్ చేయకుండా ఉంటారా. అందుకే అవకాశం లేకున్నా ఆచార్యలోనూ అలాటి పాటలు పెట్టారు. బట్ ఫస్ట్ టైమ్ హీరోయిన్, పాటలు లేకుండా గాడ్ ఫాదర్ లా వచ్చాడు. సినిమా ఆకట్టుకున్నా.. ఆయన ఫ్యాన్స్ మాత్రం కాస్త డిజప్పాయింట్ అయ్యారు. బట్ ఈ సారి గాడ్ ఫాదర్ లోటును కూడా పూడ్చేలా వాల్తేర్ వీరయ్య అంటూ వింటేజ్ మెగా మాస్ లుక్ తో రాబోతున్నాడు.

ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. అయితే ఇదో ఐటమ్ సాంగ్. బాస్ తో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రూతేలా ఈ స్పెషల్ సాంగ్ లో చిందేసింది. దేవీ శ్రీ ప్రసాద్ ఆల్రెడీ ఇచ్చిన బిల్డప్ కు ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూసిన ఈ పాట ఊహించినంత గొప్పగా ఏం లేదు కానీ.. మెగాస్టార్ స్మార్ట్ స్టెప్పులు మాత్రం అదిరిపోయాయి. ఈ వయసులో మరీ పెద్ద స్టెప్పులు వేయలేడు. అయినా ఆయనకు మాత్రమే సొంతమైన గ్రేస్ కనిపిస్తోందీ సాంగ్ లో.


దేవీ శ్రీ ప్రసాద్ ప్రామిస్ చేసినట్టుగా మాత్రం ట్యూన్ లేదు. విశేషం ఏంటంటే ఈ పాటను రాసింది కూడా దేవీ శ్రీ ప్రసాదే. కీ బోర్డ్ తో పాటు అప్పుడప్పుడూ కలాన్ని కదిలిస్తుంటాడు దేవీ. బట్ పాటంతా చాలా సాధారణంగానే ఉంది. “క్లబ్బుల్లోనా పార్టీ అంటే షరా షరా మామూలే”.. అంటూ సాగే ఈ పాటను వాల్తేర్ వీరయ్య బోట్ లో చేసుకునే పార్టీకి ఇన్వైట్ చేసే సందర్భంలో వస్తుందని తెలుస్తుంది. కేవలం బాస్ స్టెప్పుల కోసమే కంపోజ్ చేసినట్టుగా ఉన్న ఈ ట్యూన్ కూడా ఏమంత గొప్పగా లేదు. వెరీ రొటీన్. అటు పాట కూడా పార్టీ సాంగ్ లా కనిపించడం లేదు. మొత్తంగా చిరంజీవి, ఊర్వశి రూతేలా మాత్రమే ఈ పాటలో హైలెట్ గా ఉంటారు అనిపిస్తోంది. మరి సినిమాలో ఎలా ఉంటుందో కానీ.. ఆడియోగా మాత్రం ఏమంత గొప్పగా లేదీ సాంగ్.