ఉస్తాద్ రామ్ ఓ రేంజ్ ఆఫర్

రామ్.. కెరీర్ మొదలుపెట్టిన చాలా యేళ్లైనా తనదైన శైలిలో రాణిస్తున్నా.. ఎందుకో ఓ ఖచ్చితమైన ఇమేజ్ మాత్రం సంపాదించలేకపోయాడనే చెప్పాలి. వైవిధ్యమైన సినిమాలు చాలానే చేశాడు. కానీ అతని రేంజ్ మారలేదు. ఫ్యాన్స్ ఉన్నా.. పర్టిక్యులర్ ఇమేజ్ ఇచ్చే కిక్ వేరే కదా. ఆ విషయంలో కొన్నాళ్ల క్రితం వరకూ వెనకబడి ఉన్న రామ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లాడు పూరీ జగన్నాథ్. పూరీతో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో ఓవర్ నైట్ మాస్ హీరోగా దుమ్మురేపాడు. ఈ సినిమాతో తన పేరుకు ముందు ఉస్తాద్ అనే ట్యాగ్ ను సైతం ధైర్యంగా తగిలించుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ అటు హిందీ బెల్ట్ లోనూ ఇరగదీసింది. మరోవైపు రామ్ కు హిందీ డబ్బింగ్ మార్కెట్ ను అంతకు ముందు కంటే డబుల్ చేసిందీ సినిమా. అయితే ఇస్మార్ట్ మూవీ తర్వాత చేసిన రెడ్ సినిమా నిరాశపరిచినా.. కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘ద వారియర్’అంటూ రాబోతున్నాడు.
ఒకప్పుడు కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ అనిపించుకున్నా.. తర్వాత వరుస ఫ్లాపులతో చాలా వెనకబడిపోయిన దర్శకుడు లింగుస్వామితో బై లింగ్వుల్ గా తెరకెక్కుతోన్న చిత్రమే ఈ వారియర్. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. అక్షర గౌడ్ ఓ కీలక పాత్ర చేస్తుండగా.. తన కెరీర్ లో ఇప్పటి వరకూ చేయనంత క్రూయల్ విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఇక ఆ మధ్య విడుదల చేసిన టైటిల్ పోస్టర్ లో యంగ్ కాప్ గా పర్ఫెక్ట్ ఫిట్ నెస్ తో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం బాడీ మేకోవర్ చేస్తుండగానే జిమ్ లో గాయపడ్డాడు రామ్. అయితేనేం.. ఆ గాయానికి సరైన రిజల్ట్ వస్తుందనేలా ఉందీ సినిమా.
ఇక అసలు విషయం ఏంటంటే.. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఊపుతో కాబోలు.. ద వారియర్ హిందీ డబ్బింగ్ కు అద్భుతమైన రేట్ వచ్చింది. నిజంగా ఇది రామ్ మార్కెట్ తో పోలిస్తే ఎవరూ ఊహించనిది. యస్.. ఈ చిత్ర హిందీ డబ్బింగ్ రైట్స్ 16కోట్లు పలికింది. షాకింగ్ ప్రైస్ కదూ. అవును మరి ఒకప్పుడు రామ్ సినిమాల బడ్జెట్టే ఇంత ఉండేది. అలాంటి డబ్బింగ్ రైట్స్ కే ఈ రేంజ్ ప్రైస్ వచ్చాయంటే కారణం ఖచ్చితంగా ఇస్మార్ట్ శంకర్ అనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు లింగుస్వామి ఫామ్ లో లేడు. అయినా ఈ భారీ అమౌంట్ రావడం అనేది కేవలం రామ్ క్రెడిట్ గానే చెప్పాలి. ఏదేమైనా ఉస్తాద్ ఆఫర్ అనిపించింది కదా ఇదీ..

Related Posts