అల్లు అర్జున్ కు బిడి, మహేష్ బాబుకు సిగరెట్ ఇచ్చిన త్రివిక్రమ్

ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరబ్బా.. ఎప్పుడు హిట్ కొట్టినా.. అందులోని అంశాలనే మళ్లీ రిపీట్ చేస్తుంటాడు. అందుకే అప్పుడు అల్లు అర్జున్ చేతుల బీడి పెట్టి దమ్ము లాగించిండు. ఇప్పుడు మహేష్ బాబుకేమో సిగరెట్ చేతలి పెట్టిండు.. ఏందీ.. ఇదంతా ఏదో తేడా ఉందే అనిపిస్తోంది కదా..? నిజమే మరి.. కొన్నిసార్లు కొన్ని విషయాలు పాతగా ఉన్నా కొత్తగా కనిపిస్తాయి. ఇప్పుడు మహేష్ బాబు చేతిలో సిగరెట్ చూసినప్పుడు తెలియకుండానే చాలామంది అల్లు అర్జున్ బిడిని గుర్తు చేసుకుంటున్నారు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. త్రివిక్రమ్ లాస్ట్ మూవీ అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ కు సంబంధించి ఓ ఫోటో రిలీజ్ చేశారు. అప్పట్లో అది హైలెట్ అయింది కూడా. అల వైకుఠపురములో సినిమాలో కనిపించిన కాస్ట్ లీ బిల్డింగ్ ఎదురుగా కూర్చుని స్టైలిష్ లుక్ తో చేతిలో బిడి పెట్టుకుని ఉండే స్టిల్ అది. ఆ బిడికి.. ఎదురుగా ఉన్న ఆ ఇంటికి మధ్య చాలా దూరం అని చెప్పకనే చెప్పాడు. పైగా స్టైలిష్ స్టార్ గా ఉన్న అప్పటి అర్జున్ తో అలాంటి స్టిల్ చేయించడం సాహసమే. అందుకే విజయం వరించింది. బ్లాక్ బస్టర్ వచ్చింది.


ఇక ఇప్పుడు మహేష్ బాబు మూవీకి కూడా పొగతాగుట అనే సెంటిమెంట్ ను కంటిన్యూ చేశాడు త్రివిక్రమ్. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్డేట్ ఇస్తూ.. ఓ ఫోటో రిలీజ్ చేశారు. ఆ స్టిల్ లో మహేష్ బాబు తన పోకిరినాటి లుక్ ను గుర్తుకు తెస్తూ.. చేతిలో సిగరెట్ తో కనిపిస్తున్నాడు. అంటే అల్లు అర్జున్ కు బిడి చేతిలో పెట్టినట్టు మహేష్ బాబుక సిగరెట్ ఇచ్చాడన్నమాట. మహేష్ వెనక హోండా కార్ తో పాటు ఓ లారీ.. ఆ లారీ నుంచి ఎగజిమ్మినట్టుగా ఎండు మిరపకాయలూ కనిపిస్తున్నాయి. ఓరకంగా ఇది యాక్షన్ సీక్వెన్స్ లోని స్టిల్ గా అర్థం అవుతోంది. మరి ఈ పొగ రాయుళ్లతో త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడని సెంటిమెంట్ పరంగా అనుకోవచ్చా..?


అయితే మహేష్ బాబు మూవీ ఆగస్ట్ లో వస్తుందనుకున్న అభిమానులకు మాత్రం ఈ స్టిల్ తోనే గట్టి షాక్ కూడా ఇచ్చాడు త్రివిక్రమ్. ఆగస్ట్ పోతే పోయింది.. కనీసం అక్టోబర్ లో దసరాకు అయినా వస్తారు అనుకుంటే.. ఏకంగా వచ్చే యేడాది సంక్రాంతికి వెళ్లిపోయారు. 2024 జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Related Posts