టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన ‘జీబ్రా‘ చిత్రం దీపావళి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఇప్పటికే దీపావళి బరిలో ఎక్కువ సినిమాలు ఉండడంతో ఈ మూవీని వాయిదా వేశారు. తాజాగా.. నవంబర్ 22న ‘జీబ్రా‘ కొత్త విడుదల తేదీ ఖరారు చేసుకుంది. కాస్త గ్యాప్ తర్వాత సత్యదేవ్ నుంచి వస్తోన్న మూవీ ఇది.
ఈ సినిమాని పాన్ ఇండియా టచ్ తో ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో పలు భాషలకు సంబంధించిన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. సత్యదేవ్‌తో పాటు ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినెటో, డాలి ధనంజయ, సత్యరాజ్, సునీల్, సత్య వంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.