Naga chaitanya : నాన్నగారిని అడగాల్సిందే ..

ఇండస్ట్రీలో ఏ వారస హీరో అయినా చెప్పే మాట ఒకటే. తమ కథలు తామే సెలెక్ట్ చేసుకుంటాం అని. కొంత వరకూ ఇది మంచిదే. కానీ అదే పనిగా తమ జడ్జ్ మెంట్ రాంగ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా తండ్రులో లేక తమ మెంటార్స్ దో సలహా, సహాయం తీసుకోవాల్సిందే. లేదంటే ఫైనల్ గా లాస్ అయ్యేది వీళ్లే. పైగా అక్కినేని ఫ్యామిలీ హీరోలంటే కాన్ స్టంట్ గా హిట్స్ కొట్టకపోయినా.. ఖచ్చితంగా ఎవరో ఒకరు రెగ్యులర్ గా సక్సెస్ లు చూస్తూనే ఉండాలి. లేదంటే ఇలా ట్రోల్స్ కు గురవుతారు. ఇప్పటికే అక్కినేని లెగసీకి బీటలు వారాయి అనే కథనాలు నిత్యం వినిపిస్తున్నాయి.

అందుకు కారణం నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. ఈ ముగ్గురూ కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన అఖిల్ ఏజెంట్, లేటెస్ట్ గా వచ్చిన నాగ చైతన్య కస్టడీ రెండూ పోయాయి. దీంతో ట్రోల్స్ తో పాటు విమర్శలూ పెరిగాయి. మరి వీటికి సమాధానం చెప్పాలంటే కేవలం ఓ బ్లాక్ బస్టర్ ఇస్తే కానీ సాధ్యం కాదు. ఆ విషయంలో అక్కినేని హీరోలు చాలా వెనకబడుతున్నారు.

అయితే రీసెంట్ గా కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో చైతన్యకు నాగార్జున నుంచి పెద్దగా సపోర్ట్ లేదా అని అడిగితే అతను ఓ మాట చెప్పాడు.


“ఇప్పటికిప్పుడు నాన్నగారిని అడిగి నాకు ఫలానా దర్శకుడు కావాలి.. ఫలానా బ్యానర్ లో సినిమా చేయాలి అని చెబితే పది నిమిషాల్లోసెట్ చేస్తాడు. కానీ మేమే సొంతంగా ఎదగాలనుకుంటున్నాము” అన్నాడు. చైతన్య చెప్పింది ఒకరకంగా నిజమే. కానీ అతనితో పాటు తమ్ముడు అఖిల్ జడ్జిమెంట్ లు కూడా తేడా కొడుతున్నప్పుడు ఖచ్చితంగా నాగార్జున సహాయం తీసుకోవాల్సిందే.

ఇద్దరూ నాన్నగారిని అడగాల్సిందే. లేదంటే మొహమాటానికో లేక మరో దానికో కథలకు కమిట్ అయితే ఓవరాల్ గా కెరీర్ లాస్ అయ్యేది వీళ్లే. నాగ్ ఎలాగూ రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నాడు.

ఇక అక్కినేని లెగసీని ముందుకు తీసుకువెళ్లాలంటే ఈ అన్నదమ్ములే చేయాలి. అలా చేయాలంటే ఒకటి వీళ్లు ఎంచుకునే కథల్లో దమ్ముండాలి. లేదంటే ఒక అడుగు వెనక్కి తగ్గి నాన్నగారి హెల్ప్ తీసుకుని దమ్మున్న దర్శకులతో అయినా సినిమాలు చేయాలి. లేదంటే నిజంగానే అక్కినేని లెగసీకి బీటలు పెరుగుతాయి.

Related Posts