హిట్ మూవీ ఇచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కామన్ గానే చూస్తాం. కానీ హిట్ లేకపోయినా రిపీట్ చేయడం మాత్రం అరుదు. అలాంటి అరుదైన ఫీట్ ను చేస్తున్నాడు తమిళ్ స్టార్ హీరో అజిత్. మనోడికి బాగా నచ్చితే అదే దర్శకుడితో వరుసగా సినిమాలు చేస్తాడు. అంతకు ముందు శివతో హ్యాట్రిక్ మూవీస్ చేశాడు. ఇప్పుడు హెచ్ వినోద్ తోనూ అదే చేస్తున్నాడు. అయితే శివ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్. కానీ వినోద్ ఆ మ్యాజిక్ చేయలేదు. అయినా ఈ దర్శకుడిని ఎందుకు రిపీట్ చేస్తున్నాడో..కోలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడుగా వెలుగుతున్నాడు అజిత్. ఓ రేంజ్ ఫ్యాన్ బేస్ కూడా ఉన్న అజిత్ ఇతర హీరోలకు భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నవాడు. అది కూడా అతన్ని మరింత అభిమానించేందుకు ఓ కారణంగా చెబుతారు.

కొన్నేళ్ల క్రితం లవర్ బాయ్ గానే కనిపించినా.. ఈ దశాబ్దంలోనే రూట్ మార్చి తనూ మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రీసెంట్ టైట్స్ లో శివ డైరెక్షన్ లో చేసిన మూడు సినిమాలూ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఈ మూడూ ఊరమాస్ మూవీసే.శివ తర్వాత అజిత్ హెచ్ వినోద్ డైరెక్షన్ లో ఆ మధ్య నీర్కొండ పార్వై అనే సినిమా చేశాడు. వినోద్ అందుకు ముందు ఖాకీ సినిమాతో సౌత్ మొత్తాన్నీ ఆకట్టుకున్నాడు. అది నచ్చడం వల్లే నీర్కొండ పార్వైకి అవకాశం ఇచ్చాడు అజిత్.

ఇది బాలీవుడ్ పింక్ మూవీకి రీమేక్. సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకపోయినా అతని వర్కింగ్ స్టైల్ నచ్చడంతో మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ కాంబోలో రీసెంట్ గా వచ్చిన వలిమై బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కేవలం యాక్షన్ సీక్వెన్స్ లు తప్ప ఏ పార్ట్ లోనూ అలరించలేకపోయింది. అయినా మరోసారి వినోద్ కే ఛాన్స్ ఇచ్చాడు అజిత్. ఇక లేటెస్ట్ గా వీరి కాంబోలో తునివు అనే సినిమా అనౌన్స్ అయింది. అంటే ధృఢమైన వాడు అని అర్థం. మరి అతనెంత స్ట్రాంగ్ అనేది సినిమా చెబుతుంది కానీ.. ఈ ఫస్ట్ లుక్ లో అజిత్ తెల్లగడ్డంపై మాత్రం యాంటీ ఫ్యాన్స్ సెటైర్స్ వేస్తున్నారు. మరి అజిత్ స్ట్రాటజీ ఏంటో కానీ.. ఇలా ఒక్కో దర్శకుడు మూడు సినిమాలు చేస్తూ వెళితే ఇంక కొత్తవారికి ఏం అవకాశం వస్తుంది.