అల్లరి నరేష్ ఉగ్రం ను ఆడియన్స్ తట్టుకుంటారా ..?

కామెడీ హీరోగా ఒకప్పటి రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని భర్తీ చేసాడు నరేష్. ఇ.ఇ.వి సత్యనారాయణ తనయుడిగా వచ్చిన తక్కువ టైం లోనే తనదైన ముద్ర వేసాడు. ఫస్ట్ మూవీ నే ఇంటిపేరుగా మార్చుకుని అల్లరి నరేష్ గా మారాడు. అప్పుడప్పుడు సీరియస్ మూవీస్ తోనూ ఆకట్టుకున్నాడు. పైగా ఆ మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ కూడా అందుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా నరేష్ తరహా కామెడీకి కాలం చెల్లింది. దీంతో వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాడు. కొంత గ్యాప్ తీసుకుని చేసిన నాంది నరేష్ లోని మరో కొత్త కోణాన్ని చూపించింది. దీంతో ఈ తరహా సినిమాలే బెటర్ అనుకున్నాడేమో మరోసారి అదే దర్శకుడుతో ఉగ్రం అనే మూవీ తో వస్తున్నాడు.వచ్చే శుక్రవారం ఈ చిత్రం విడుదల కాబోతోంది.


రీసెంట్ గా రిలీజ్ అయినా ఉగ్రం ట్రైలర్ చూస్తే టైటిల్ కి తగ్గట్టుగానే అగ్రెసివ్ గా ఉంది. ఒక మాస్ హీరో రేంజ్ లో యాక్షన్ డోస్ కనిపిస్తోంది. నరేష్ సినిమాల్లో ఎన్నడూ లేని బ్లడ్ షెడ్ ఉంది. ఎంత కాదనుకున్న నరేష్ ఇమేజ్ పూర్తిగా పోలేదు. చాలామంది ఇంకా అతన్ని కామెడీ హీరోగానే చూస్తున్నారు. నాంది అంటే కాస్త అమాయకుడు కాబట్టి వర్క్ అవుట్ అయింది. కానీ ఈ ఉగ్రం అలా కాదు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉంది. మరి ఈ రేంజ్ యాక్షన్ ను నరేష్ చేస్తే ఆడియన్స్ చూస్తారా అనేది పెద్ద ప్రశ్నే. బట్ కంటెంట్ బలంగా ఉంటే ఇబ్బంది ఏం ఉండదు.

అయినా నరేష్ ఫైట్స్ ను జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మూవీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరో విషయం ఏంటంటే ఈ మూవీకి అంతా నరేషే. అతను కాకుండా మరో ఇంట్రెస్టింగ్ ఫాక్టర్ కనిపించడం లేదు. ట్రైలర్ ను బట్టి ఇది కథ బలం ఉన్న చిత్రం అనిపిస్తోంది. అంటే ఆయా పాత్రలన్నీ కథకు తగ్గట్టుగానే ఉంటాయి తప్ప వారి ఇమేజ్ కనిపించకూడదు. ఆ విషయం లో నరేష్ ఆల్రెడీ విజయం సాధించినట్టే. మిగతా విషయాలు ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో కానీ.. అతనితో పాటు మాస్ హీరో గోపీచంద్ పోటీగా ఉన్నాడు. సో కంపిటిషన్ గట్టిగానే ఉంది. గోపిని కాదని జనం నరేష్ కు ఓటు వేయాలంటే అతన్ని మించిన బలమైన కంటెంట్ తో రావాలి. అప్పుడే అల్లరి నరేష్ ఉగ్రం ను ప్రేక్షకులు తట్టుకుంటారు.

Related Posts