ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ విజయ్ కి వస్తుందా..

ప్యాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ కు ఇప్పుడు ఏ రేంజ్ ఇమేజ్ ఉందో అందరికీ తెలుసు. ఆ తర్వాత సౌత్ నుంచి కెజీఎఫ్‌ తో సత్తా చాటినా.. యశ్ కు అదే స్థానం వస్తుందని అనుకోలేం. ఇప్పటి వరకూ యశ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పలేకపోయాడు. మరోవైపు దుల్కర్ సాల్మన్ సత్తా చాటుతున్నా.. అతను ప్రభాస్ రేంజ్ కు కాదు.. దరిదాపుల్లోకి కూడా వెళ్లలేడు అనేది నిజం. ఎందుకంటే అతనివి సాఫ్ట్ నేచర్ ఉన్న సినిమాలు. తన నటనా అదే ఎలివేట్ చేస్తుంది. సో.. మాస్ హీరోగా ఆ స్థాయికి అతను వెళ్లలేడు. ఇక తెలుగు నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ లకు ఆ స్టామినా ఉంది. బట్ వీరి తర్వాతి సినిమాలు రిలీజ్ అయితే కానీ రేంజ్ గురించి చెప్పలేం. ఒకవేళ నెక్ట్స్ మూవీస్ కూడా ప్యాన్ ఇండియన్ రేంజ్ లో బ్లాక్ బస్టర్స్ అయితే.. ఇండియన్ బాక్సాఫీస్ కు హైదరాబాదే అడ్డా అవుతుందనేది నిజం. అయితే లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ సౌత్ వ్యాప్తంగా రన్ అవుతోంది.ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ కు వెళ్లే స్టామినా తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ కి ఉంది అని. నిజానికి విజయ్ నటన మొన్నటి వరకూ కేవలం తమిళ్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమై చాలా ఓవర్ యాక్టింగ్ తో కనిపించేది. కొన్నాల్లుగా మారాడు. ముఖ్యంగా తుపాకి సినిమా నుంచి మధ్యలో రెండు మూడు సినిమాల్లో మళ్లీ తమిళ్ అతి కనిపించినా..

రీసెంట్ మూవీస్ లో అవేం లేవు. అందుకని అతను ప్రభాస్ తర్వాతి స్థానానికి వెళతాడు అంటాం అనుకున్నారేమో. అదేం కాదు. ఇంకా చెబితే ఆ రేంజ్ అతని వల్ల కాదు.. �