హాస్టల్ డేస్ కామన్ ఆడియన్స్ వరకూ వెళుతుందా..

కొన్ని సినిమాలకు పర్టిక్యులర్ ఆడియన్స్ ఉంటారు. ఆ సినిమా వారిని చేరితే చాలు.. హిట్ అయిపోతుంది. బట్ అన్ని వర్గాల ప్రేక్షకులను చేరితేనే బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. అందుకు ఆ పర్టిక్యులర్ కంటెంట్ ను అత్యంత వినోదాత్మకంగా చెబితే మిగతా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.

కన్నడలో రూపొందిన హాస్టల్ హుడిగిరి బేకాగిద్దర అనే సినిమా కూడా అదే చేసింది. అందుకే అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అలా బ్లాక్ బస్టర్ రివ్యూస్ రాగానే ఇలా తెలుగులో డబ్ చేయడం మొదలుపెట్టారు మనవాళ్లు. అయితే ఇక్కడ ఈ మూవీకి ప్రచారం చాలా తక్కువగా ఉంది. అక్కడి రివ్యూస్ ను ఇక్కడి కామన్ ఆడియన్స్ చూడ్డం దాదాపు అసాధ్యం. అందువల్ల వీళ్లే ఎక్కువ ప్రమోషన్స్ చేసుకోవాలి. ఆ వి

షయంలో హాస్టల్ డేస్ తెలుగు ప్రొడ్యూసర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేస్తున్నట్టేం కనిపించడం లేదు. ప్రీమియర్స్ అంటూ హడావిడీ చేస్తున్నారు కానీ వీటికి అర్బర్స్ లో తప్ప ఆదరణ ఉంటుందా అంటే చెప్పలేం.


నిజానికి హాస్టల్ డేస్ మూవీకి ప్రమోషన్స్ చేసేంత టైమ్ లేదు. చాలా వేగంగా రిలీజ్ డేట్ పెట్టుకున్నాడు. ఈ డేట్ దాటితే సెప్టెంబర్ మొత్తం సాధ్యం కాదు. ఆ నెలలో నాలుగు వారాలూ పెద్ద సినిమాలతో ప్యాక్ అయ్యి ఉన్నాయి. ఇక యూత్ ఫుల ఎంటర్టైనర్ అని చెబుతున్న ఈ సినిమా హాస్టల్ తో అనుబంధం వారికి ఎక్కువగా కనెక్ట్ అవ్వొచ్చు.

అలా అందరు ప్రేక్షకులూ ఉండలేరు కదా. పైగా ఆర్టిస్టుల్లో తెలిసిన మొహాలు ఒక్కటీ లేవు. అది కూడా సమస్య అవుతుంది. మరీ కాంతార రేంజ్ కంటెంట్ ఉంటే తప్ప వర్కవుట్ కాదు అనుకోవడానికి కూడా లేదు. కాంతారలో ఎవరూ తెలియకపోయినా.. అది యూనిక్ కంటెంట్. మొత్తంగా ఇంకాస్త ప్రమోషన్స్ చేసి అప్పుడు విడుదల చేస్తే ఈ మూవీకి కొంత ఎక్కువ ఉపయోగం ఉండేదేమో కానీ.. ఇప్పుడైతే అస్సలు సౌండే లేదు.

Related Posts