వరుణ్-లావణ్య పెళ్లి ఇటలీ లోనే ఎందుకు?

ఇటలీలో వరుణ్-లావణ్య పెళ్లి సందడి మొదలైంది. అయితే తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం వీరిద్దరూ ఇటలీనే ఎందుకు ఎంచుకున్నారు? అందులో మతలబు ఏంటి? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. తాజాగా ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇంతకీ విషయమేమిటంటే ఇటలీలో షూటింగ్ లో పాల్గొన్నప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. దీంతో తమ పెళ్లిని ఇటలీలోనే చేసుకోవాలని అప్పుడే డిసైడయ్యారట. ఆ విధంగానే ఇప్పుడు ఇటలీలో పెళ్లి పీటలెక్కుతున్నారు.

మరోవైపు వీరిద్దరి పెళ్లి వేడుకకు సంబంధించిన విశేషాలతో కూడిన ఓ ఇన్విటేషన్ కార్డ్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్టోబర్ 30న అంటే నిన్న సోమవారం రోజున కాక్ టెయిల్స్ పార్టీ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ కు గెస్ట్స్.. బ్లాక్ టై ఎటైర్ లో రావాలని తెలిపారు.

ఇక ఈరోజు ఉదయం 11 గంటల నుంచి హల్దీ వేడుక జరుగుతోంది. ఈ వేడుకలో యెల్లో, వైట్ అండ్ పింక్ కలర్స్ లో గెస్ట్స్ సందడి చేయనున్నారు. ఈరోజే సాయంత్రం 5.30 గంటల నుంచి మెహందీ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకలో వైబ్రెంట్ కలర్స్ లో అతిథులంతా సందడి చేయనున్నారట.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి వివాహానికి నవంబర్ 1, మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ పెళ్లి వేడుకలో అతిథులందరూ పాస్టల్స్ ఎటైర్ లో కనువిందు చేయాలని కోరారు. ఇక.. నవంబర్ 1న సాయంత్రం 8 గంటల 30 నిమిషాల నుంచి రిసెప్షన్ నిర్వహించనున్నారు. రిసెప్షన్ లో గ్లిట్జ్ అండ్ గ్లామ్ ఎటైర్ లో అతిథులంతా సందడి చేయనున్నారు.

Related Posts