HomeMoviesటాలీవుడ్హల్దీ వేడుకతో ప్రారంభమైన పెళ్లి సందడి

హల్దీ వేడుకతో ప్రారంభమైన పెళ్లి సందడి

-

అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలయ్యింది. నాగచైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న జరగనుంది. నాగచైతన్య, శోభిత జంట టాలీవుడ్ అభిమానుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ వివాహానికి సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా వీరి హల్దీ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మంగళ స్నానాలు జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ప్రేమ జంట పెళ్లి అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన ప్రదేశమైన అన్నపూర్ణ స్టూడియోలో జరుగనుంది. నాగచైతన్య ఈ విషయంపై మాట్లాడుతూ ‘అన్నపూర్ణ స్టూడియో మా కుటుంబానికి ఎప్పుడూ ప్రత్యేకం. నా తాతగారి విగ్రహం ముందు పెళ్లి చేసుకోవడం గొప్ప అనుభూతి. మా కుటుంబాల ఆశీస్సులతో వివాహం జరగనుంది‘ అని అన్నాడు.

వివాహాన్ని నిరాడంబరంగా, కానీ హృదయపూర్వకంగా నిర్వహించాలని నాగచైతన్య, శోభిత ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. ఆర్భాటాలకు తావు లేకుండా సన్నిహితుల సమక్షంలో సింపుల్ వేడుకగా వివాహం జరగనుంది. తమ పెళ్లి పనులన్నింటికీ వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తున్నామంటూ నాగచైతన్య తెలిపిన విషయం తెలిసిందే. ‘వివాహానికి ఎవరిని ఆహ్వానించాలో, ఇతర ఏర్పాట్లు ఎలా చేయాలో నేను, శోభిత కలిసి నిర్ణయిస్తున్నాం‘ అని ఇంతకు ముందే చైతూ చెప్పాడు.

ఇవీ చదవండి

English News