Samantha : మంచి సంబంధం కావలెను – సమంత

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఏం మాట్లాడినా ఆ కోణంలోనే చూస్తున్నారు జనం. పైగా తను పెళ్లి, ప్రేమ లాంటి పదాలు వాడితే ఇంక అంతే సంగతులు అన్నట్టుగా మారింది పరిస్థితి. తాజాగా తన ఇన్ స్టాలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ కూడా ఇలాగేవైరల్ అయింది. మరి ఆ పోస్ట్ లో ఏముందో తెలుసా.. ఒక కుర్రాడి ఫోటో పెట్టి.. “ఓ మంచి సంబంధం కోసం చూస్తున్నాం.. అతను కనిపించేదానికన్నా చాలా తెలివైనవాడు” అని పోస్ట్ చేసింది. దీంతో ఆ కుర్రాడు ఆమె బంధువు లేదా ఇంకేదైనా రిలేటివ్ నా అనుకున్నారు చాలామంది. కానీ కాదు. మరి అతనెవరూ అంటే..?


ఈ కుర్రాడి పేరు డాక్టర్ జెవెల్ గమాడియా. ఫేమస్ సెలబ్రిటీ డాక్టర్. అంటే అతను ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీస్ కే ట్రీట్మెంట్ చేస్తుంటాడు. అతని లిస్ట్ లో అనుష్క శర్మ, కత్రినా కైఫ్, అజయ్ దేవ్ గణ్‌ వంటి టాప్ స్టార్స్ ఉన్నారు.

పాశ్చాత్య పద్ధతిలో ఆక్యుపంక్చర్ వైద్యం చేయడంలో అతను మంచి ఎక్స్ పర్ట్ అంట. అందుకే చాలామంది బాలీవుడ్ బిగ్గీస్ అతని పేషెంట్స్ గా ఉన్నారు. రీసెంట్ గా సమంత కూడా అతని వద్దే వైద్యం చేయించుకుంది. ఆ పరిచయంతోనే ఇలా ఏకంగా పెళ్లి సంబంధం చూసేవరకూ వెళ్లిందన్నమాట. మరి సమంత హామీతో ఈ డాక్టర్ బాబుకు మంచి వంటలక్క దొరుకుతుందేమో చూడాలి.

Related Posts