విజువల్ ఫీస్ట్ లా ఆదిపురుష్ ట్రైలర్

ప్యాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించిన సినిమా ఆదిపురుష్. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇది.

ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. అంచనాలకు భిన్నంగా ట్రైలర్ ఈ సారి అద్భుతం అనే టాక్ తెచ్చుకుటోంది. ఏ.ఎమ్.బి మాల్ లో జరిగిన ట్రైలర్ ప్రివ్యూ కు మూవీ టీమ్ మొత్తం హాజరైంది. ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. హనుమంతుడి కోణంలో సాగే కథలా ఈ ట్రైలర్ ఆరంభంలోనే కనిపిస్తుంది.


‘‘ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం.. జాగ్రుతం. నా రాఘవుడి కథే రామాయణం.. ’’ అంటూ హనుమంతుడు చెబుతుండగా ట్రైలర్ ప్రారంభం అవుతుంది.

ఆ వెంటనే భిక్షాందేహీ అంటూ రావణుడు ఎంట్రీ.. సీతను ఎత్తుకుపోవడం కనిపిస్తుంది. సీత తీసుకు రావడానికి లక్ష్మణుడు అయో