HomeMoviesటాలీవుడ్‘విశ్వంభర‘ సాంగ్ లీక్ చేసిన చిరు

‘విశ్వంభర‘ సాంగ్ లీక్ చేసిన చిరు

-

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర‘ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబవుతుంది. విడుదల తేదీకి ఇంకా చాలా సమయం ఉండడంతో సినిమా ప్రచారం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది టీమ్. అందుకే.. ఇటీవల చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా ‘విశ్వంభర‘ నుంచి టీజర్ లేదా స్పెషల్ గ్లింప్స్ అయినా వస్తుందని ఎదురు చూశారు మెగాభిమానులు. కానీ.. ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. కేవలం చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటే విడుదల చేశారు మేకర్స్.

Image 239

లేటెస్ట్ గా ‘విశ్వంభర‘లోని ఓ సాంగ్ గురించి ఆసక్తికర విషయాన్ని లీక్ చేశాడు మెగాస్టార్. ‘ఇంద్ర‘ చిత్ర బృందానికి తన ఇంట్లో సత్కారం చేసిన సందర్భంగా.. ‘విశ్వంభర‘లోని ఓ పాట గురించి ప్రస్తావించారు. ‘ఇంద్ర‘ సినిమాలోని ‘భమ్ భమ్ బోలే‘ సాంగ్ తరహాలో ‘విశ్వంభర‘లోనూ ఓ భక్తి తరహా గీతం ఉంటుందని చిరు లీక్ చేశాడు.

‘ఇంద్ర‘లోని పాట తరహాలోనే తనకూ ఓ పాట కావాలని ‘విశ్వంభర‘ డైరెక్టర్ వశిష్ట అడగానే.. అదిరిపోయే ట్యూన్ అందించాడట సంగీత దర్శకుడు కీరవాణి. మరకతమణి కీరవాణి అనగానే క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ఎలాంటి ట్యూన్స్ అయినా అందించగలడు. గతంలో చిరంజీవికి సైతం ‘ఘరానా మొగుడు, ఆపద్భాంధవుడు‘ వంటి మాస్, క్లాస్ మూవీస్ కి సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. మరి.. చిరు లీక్స్ ద్వారా బయటపడిన ‘విశ్వంభర‘లోని ఆ భక్తి తరహా గీతం ఏ రేంజులో ఉంటుందో చూడాలి.

ఇవీ చదవండి

English News