దుమ్మురేపుతున్న విరూపాక్ష.. వీకెండ్ కే లాభాల బాటలో

సాయిధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల తర్వాత సాయిధరమ్ తేజ్ మూవీకి బిగ్గెస్ట్ హిట్ టాక్ వచ్చింది. కొన్నాళ్లుగా సాయితేజ్ మార్కెట్ కాస్త డల్ గా ఉంది. దీంతో ఓపెనింగ్స్ గ్రాండ్ గా లేకపోయినా.. పబ్లిక్ టాక్ తో శుక్రవారం సాయంత్రానికే బుకింగ్స్ పెరిగాయి. ఆ తర్వాత వీకెండ్ మొత్తం దుమ్మురేపింది విరూపాక్ష.

ఆ మూడు రోజుల్లోనే 20 కోట్ల షేర్ వసూలు చేసి సత్తా చాటిందీ మూవీ. గ్రాస్ గా చూసుకుంటే 37 కోట్ల వరకూ ఉంటుందన్నమాట. అటు ఓవర్శీస్ లో కూడా కలెక్షన్స్ పెరిగాయి. మూడు రోజుల్లోనే మిలియన్ మార్క్ కు దగ్గరగా వచ్చింది.

ఈ ఊపు కంటిన్యూ అయితే సాయిధరమ్ కు ఫస్ట్ మిలియన్ క్లబ్ మూవీగా మారుతుంది. నిజానికి సాయిధరమ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోకు మూడు రోజుల్లో ఈ షేర్ రావడం అనేది చాలా రేర్ థింగ్. ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా అంత సాధ్యం కాదు. బట్ ఈ మూవీకి అటు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా అద్బుతమైన స్పందన రావడంతో కలెక్షన్స్ అనూహ్యంగా డబుల్, త్రిబుల్ అయ్యాయి. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా వచ్చినా.. అన్ని వర్గాల ప్రేక్షకులూ చూసే విధంగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెరిగారు. అదే విరూపాక్షకు మరింత ప్లస్ అయింది.


బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వారంతట వాళ్లే థియేటర్స్ వెదుక్కుంటూ వస్తారని మరోసారి ప్రూవ్ చేసింది విరూపాక్ష. ఇది ఖచ్చితంగా కంటెంట్ బలం ఉన్న సినిమా. కమర్షియల్ వాల్యూస్ అంటూ కథను దాటకుండా నిలబడిన సినిమా. హీరోయిజం పేరుతో లేని పోని బిల్డప్స్ కు పోకుండా కథకే స్టిక్ అయిన మూవీ. అందుకే యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది విరూపాక్ష. మరి జోష్ నెక్ట్స్ వీక్ వచ్చే సినిమాలు కూడా కంటిన్యూ చేస్తే ఈ సమ్మర్ కు మాంచి ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.

Related Posts