ఈ మధ్య తెలుగులో పొలిటికల్ సినిమాలు బాగా వస్తున్నాయి. కొందరు పోటీకి తీస్తుంటే మరికొందరు కంటెంట్ తో వస్తున్నారు. పోటీగా తీసేవాళ్లలో రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను చెప్పాలి. ఇది పూర్తిగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా తీసిన సినిమా.మరోవైపు జగన్ పాదయాత్ర కథగా మహి వి రాఘవ యాత్ర2 చేస్తున్నాడు. ఈ క్రమంలో మరో పొలిటికల్ సినిమా అనౌన్స్ అయింది. సినిమా పేరు “జితేందర్ రెడ్డి”. హిస్టరీ నీడ్స్ టూ బి టోల్డ్ అనేది ఉపశీర్షిక. అంటే చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉందని అర్థం. మరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నది ఎవరో తెలుసా.. ?

రాజ్ తరుణ్ హీరోగా పరిచయం చేస్తూ తను దర్శకుడుగా పరిచయం అయిన విరించి వర్మ ఈ జితేందర్ రెడ్డిని రూపొందిస్తున్నాడు. 2013లో ఉయ్యాల జంపాల సినిమా వచ్చింది. ఆ తర్వాత మూడేళ్లకు అతనికి నేచురల్ స్టార్ నాని ఛాన్స్ ఇచ్చాడు. అతనితో 2016లో మజ్ను అనే సినిమా రూపొందించాడు. బట్ ఇది పోయింది. అప్పటి నుంచి మరో ప్రాజెక్ట్ సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు విరించి వర్మ. ఆ మధ్య కళ్యాణ్ రామ్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. మరి ఆ ప్రాజెక్ట్ గురించిన అప్డేట్ ఏం లేదు. ఇన్నాళ్లకు సెట్ అయింది. మామూలుగా అతని సినిమాలతో పాటు అంతకు ముందు తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూస్తే విరించి వర్మ పొలిటికల్ మూవీ తీస్తున్నాడు అనేది ఆశ్చర్యంగా ఉందంటున్నారు చాలామంది.

ఇక ఈ చిత్రం గురించి ప్రస్థానం, రిపబ్లిక్ వంటి మూవీస్ తీసిన దేవా కట్టా ట్విట్టర్ లో పరిచయం చేశాడు. విరించి వర్మకు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. సినిమా కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు. ఇక ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే ప్రధాన నాయకుడు ఎవరనేది రివీల్ చేయలేదు. ఈ మూవీతో విరించి వర్మ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో కానీ ఈ చిత్రాన్ని ముద్దుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇతను బిజెపిలో క్రియాశీలక నేత కావడం విశేషం. మరి ఇది రియల్ స్టోరీనా లేక ఫిక్షనల్ స్టోరీనా అనేది చూడాలి.