మే 17 నుంచి ఆహాలో ‘విద్య వాసుల అహం’

‘కోట బొమ్మాళి పి.ఎస్’ సినిమాతో మంచి విజయాన్నందుకున్న రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘విద్య వాసుల అహం’. ఈ సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తల పాత్రల్లో కనిపించనున్నారు. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు ఈగో కూడా మంచి రోల్ ప్లే చేస్తుందనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. నూతన వధూవరులుగా రాహుల్ విజయ్, శివాని నటించారు.

మే 17 నుంచి ఆహా వేదికగా స్ట్రీమంగ్ కి రెడీ అయిన ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ రిలీజయ్యింది. ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నవ్య మహేష్, ఏం రంజిత్ కుమార్ కొడాలి, చందనా కట్టా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Related Posts