‘సత్యభామ’ నుంచి ‘వెతుకు వెతుకు’ వీడియో సాంగ్

పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ నుంచి రాబోతున్న చిత్రాలలో ‘సత్యభామ’ ఒకటి. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో సుమన్ చిక్కాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరో దర్శకుడు శశి కిరణ్ తిక్కా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సమకూరుస్తుండడం విశేషం. శ్రీచరణ్ పాకాల సంగీతాన్నందిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ‘వెతుకు వెతుకు’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ రిలీజయ్యింది. అన్యాయం జరిగిన అమ్మాయిలకోసం కాజల్ పోలీసాఫీసర్ పాత్రలో పరిష్కార మార్గాలు వెతికే క్రమంలో ఈ పాట ఉంటుందనేది ఈ వీడియో సాంగ్ చూస్తే స్పష్టమవుతుంది.

ఆస్కార్ విజేత చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని మరో ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్.కీరవాణి ఆలపించడం విశేషం. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కడపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related Posts