మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘మట్కా’. ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడిక్ డ్రామా ఇది. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందట. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఆట చుట్టూ ఈ సినిమా కథ తిరగనున్నట్టు తెలుస్తోంది. వైజాగ్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో వరుణ్ నాలుగు గెటప్పుల్లో కనిపించనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా సగ భాగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో.. నడి వయసు ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. ‘పేదరికం నుండి అధికార శిఖరానికి ప్రయాణం’ అంటూ ఈ పోస్టర్ కి ఓ కొటేషన్ ఇచ్చారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందే సినిమా ఇది అని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, కిశోర్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.