మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మట్కా ప్రమోషన్స్ ను షురూ చేశారు. అయితే మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు.ఈ ఈవెంట్ కి వరుణ్ తేజ్ లావణ్య తో కలిసి వచ్చాడు. వీరిద్దరూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
ఈ ఈవెంట్ ను హోస్ట్ చేస్తున్న సుమ వరుణ్ తేజ్ లావణ్య తో కాస్త ఫన్నీ కన్వర్జేషన్ చేసింది. ట్రూ ఆర్ ఫాల్స్ అని మాత్రమే చెప్పాలి అనడం తో చాలా చమత్కారంగా సమాధానాలు చెప్పారు ఇద్దరు. లావణ్య సాంబార్ బాగా చేస్తుంది అని వరుణ్ అనటం లావణ్య కాస్త సిగ్గు పడటం, అలానే మీరూ చేస్కున్న ప్రమాణాలు గురించి చెప్పండి అన్నప్పుడు లావణ్య నీ పెళ్ళి చేసుకుంటాను అని ప్రమాణం చేశాను చేసుకున్నాను అని కాకపోతే 2 ఇయర్స్ లేట్ అయ్యింది అనటం ఇలా వారిద్దరి మధ్య ఉన్న అన్యోన్య దాంపత్యాన్ని అర్థం అయ్యేలా చేశాయి.
ఇటీవల మట్కా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో లావణ్య తో కలిసి సినిమా చేస్తారా అని అడిగితే ఖచ్చితంగా చేస్తాను, మంచి కథ లావణ్య కి నచ్చడమే ఆలస్యం అని వరుణ్ సమాధానం ఇచ్చారు. అలానే బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు కూడా నాగార్జున తన జుట్టు గురించి అడిగిన ప్రశ్నకు చాలా చక్కగా జవాబు చెప్పాడు. లావణ్య నాకు ఇంట్లో పిలకలు వేస్తుంది, అలానే కోపం వచ్చినప్పుడు పట్టుకుని కొడుతుంది అని ఫన్నీ గా సమాధానం ఇచ్చారు.. ఈ జంట ఇపుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది..అలానే సోషల్ మీడియా మెగా అభిమానులు కూడా వీరిద్దరికీ ఎలాంటి దృష్టి తగలకూడదు అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.